స్మార్ట్‌ గార్డెన్‌.. మట్టిలేకుండానే మినీ తోట! | Smart Gadgets Turn Gardening High-Tech, From AI Bird Feeders To Robotic Watering Systems | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ గార్డెన్‌.. మట్టిలేకుండానే మినీ తోట!

May 31 2026 4:50 PM | Updated on May 31 2026 6:14 PM

Smart Nature Cool Gadgets That Make Gardening Effortless

మొక్కలకు నీళ్లు పోయడం నుంచి, పక్షులకు ఆహారం పెట్టడం వరకు... ఇప్పుడు ప్రకృతి పరిరక్షణ కూడా హైటెక్‌ అయిపోయింది! ఇంట్లోనే ఉంటూ తక్కువ కష్టంతో ఎక్కువ గ్రీనరీని ఎంజాయ్‌ చేయాలనుకునేవారి కోసం వచ్చేసిన సూపర్‌ నేచర్‌ గ్యాడ్జెట్సే ఇవీ!

రోబోటిక్‌ తోటమాలిఈ వేసవి ఎండల్లో మీరు మాత్రం హాయిగా రూమ్‌లోనో కూర్చుంటే, ఎవరైనా పైపు పట్టుకుని తోటలో నిలబడితే బాగుండు! అని అనుకుంటున్నారా! అందుకే మీ మొక్కలకు నీళ్లు పోసే బాధ్యతను మోయడానికి వచ్చేసింది ఈ సోలార్‌ స్మార్ట్‌ వైఫై స్ప్రింక్లర్‌ టైమర్‌! ఇది మీ గార్డెన్‌కు ఒక చిన్న డిజిటల్‌ తోటమాలి లాంటిది. దీనికి జీతం అక్కర్లేదు, కరెంట్‌ బిల్లుల తలనొప్పి లేదు, ఇందులోని సోలార్‌ ప్యానెల్‌తో ఎండలోనే ఆటోమేటిక్‌గా రీచార్జ్‌ అవుతుంది.

పైగా మొబైల్‌ యాప్‌తో కనెక్ట్‌ చేసి ఎక్కడి నుంచైనా నీళ్లు ఎప్పుడు పట్టాలో కంట్రోల్‌ చేయొచ్చు. లేదంటే వాయిస్‌ కంట్రోల్‌తో సోఫాలో కూర్చునే ‘అలెక్సా.. మొక్కలకు నీళ్లు పోయ్‌!’ అని చెప్పేస్తే సరిపోతుంది. ‘రెయిన్ డిలే’ ఫీచర్‌తో ‘వర్షం పడుతోంది కదా.. ఎందుకు మళ్లీ నీళ్లు!’ అన్నట్టుగా ఆగిపోతుంది. ఐపీ65 వాటర్‌ప్రూఫ్‌ బాడీ, బలమైన బ్రాస్‌ ఇన్లెట్‌తో ఎండా వానలకు తట్టుకునే ఈ రోబోటిక్‌ తోటమాలి ధర రూ. 10,180 మాత్రమే!

పక్షుల కోసం స్మార్ట్‌ హోటల్‌!
ఉదయం కిటికీ దగ్గరకు వచ్చే పిచ్చుకలు, చిన్న చిన్న పక్షులను దగ్గరగా చూడాలని అనిపిస్తుందా? అయితే మీ ఇంటికే చిన్న బర్డ్‌ థియేటర్‌లా మారిపోయే ఈ సోలార్‌ ఏఐ బర్డ్‌ ఫీడర్‌ మీ కోసం! ఇది కేవలం గింజలు పెట్టే పాత్ర మాత్రమే కాదు, పక్షుల ప్రపంచాన్ని మీ కళ్ల ముందుకు తీసుకొచ్చే స్మార్ట్‌ గాడ్జెట్‌. దీనిలో ఉన్న కెమెరా పక్షులు వచ్చి గింజలు తింటున్న ప్రతి క్యూట్‌ మూమెంట్‌ను క్యాప్చర్‌ చేస్తుంది. పైగా ఇందులో ఉన్న ఏఐ టెక్నాలజీ ఏ పక్షి వచ్చిందో కూడా గుర్తించగలదు. సోలార్‌ పవర్‌తో పనిచేయడం వల్ల బ్యాటరీల తలనొప్పి ఉండదు. వర్షం, ఎండలకు తట్టుకునే వెదర్‌ప్రూఫ్‌ మెటల్‌ బాడీతో తయారైన ఈ స్మార్ట్‌ ఫీడర్‌  ధర రూ. 7,000 మాత్రమే!

మట్టిలేకుండానే మినీ తోట!
ఇంట్లోనే తాజా పుదీనా, తులసి లేదా చిన్న చిన్న కూరగాయలు పెంచుకోవాలని ఉందా? కానీ మట్టి, కుండీలు, రోజూ నీళ్లు పోసే టెన్షన్  వద్దనుకుంటున్నారా? అయితే ఈ హైడ్రోపోనిక్‌ గ్రోయింగ్‌ సిస్టమ్‌ మీ కోసం! ఇది మీ ఇంట్లోనే ఒక చిన్న స్మార్ట్‌ ఫార్మ్‌లా పనిచేస్తుంది. ఇందులో మొత్తం 12 ప్లాంటింగ్‌ స్టేషన్స్ ఉంటాయి.

మట్టికి బదులుగా నీరు, పోషకాలు, ఎల్‌ఈడీ కాంతితో మొక్కలు వేగంగా పెరిగేలా చేస్తుంది. ఇందులో ఉన్న స్మార్ట్‌ ఎల్‌ఈడీ లైట్లు సూర్యరశ్మిలా పనిచేసి మొక్కలకు అవసరమైన కాంతిని ఇస్తాయి. 4.2 లీటర్ల పెద్ద వాటర్‌ ట్యాంక్, ఆటోమేటిక్‌ వాటర్‌ సర్క్యులేషన్ సిస్టమ్‌తో మొక్కలకు కావాల్సిన నీరు, ఆక్సిజన్  నిరంతరం అందుతాయి. లైట్‌ స్టాండ్‌ ఎత్తును కూడా మొక్కల పెరుగుదలకు తగ్గట్టు మార్చుకోవచ్చు. ధర రూ. 14,000 మాత్రమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement