
వెండి ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలోకి రూ.1,900 పెరిగి రూ.1,41,900 స్థాయికి చేరింది. ఇది మరో నూతన గరిష్ట స్థాయి కావడం గమనార్హం. పండుగల సీజన్ నేపథ్యంలో స్టాకిస్టుల నుంచి డిమాండ్ కనిపించినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. భౌతిక మార్కెట్లో పెట్టుబడులకు బలమైన డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. గురువారం ఢిల్లీ మార్కెట్లో వెండి రూ.1,40,000 వద్ద ముగిసింది.
మరోవైపు పసిడి 20 గ్రాములకు రూ.330 లాభపడి 1,17,700కు చేరింది. అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు పెద్దగా మార్పు లేకుండా 3,745 డాలర్ల వద్ద, పసిడి ఔన్స్‌కు 0.35 శాతం తగ్గి 45 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు నెలకొన్నప్పటికీ పండుగల కొనుగోళ్లకు తోడు, దేశీ డిమాండ్ స్థిరంగా కొనసాగడం ధరలకు మద్దతుగా నిలిచినట్టు ట్రేడర్లు తెలిపారు.
ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్ ‘స్వదేశీ’ 4జీ నెట్‌వర్క్