అమ్మకాల సెగ : నష్టాల్లో సెన్సెక్స్‌ 

 sensex trading  with flat note - Sakshi

సెన్సెక్స్‌ 51 వేల దిగువన

15వేల దిగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లో బలహీన ధోరణి కొనసాగుతోంది. హై స్థాయిల్లో లాభాల స్వీకరణ,  అంతర్జాతీయ  మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో సోమవారం కీలక  సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ట్రేడింగ్‌ ఆరంభించాయి.  ఆరంభంలో స్వల్ప లాభాలతో ఉన్న సెన్సెక్స్‌ ప్రస్తుతం 187 పాయింట్ల నష‍్టంతో 50702 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో 14936 వద్దకొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 51 వేల దిగువన, నిఫ్టీ 15వేల దిగువకు చేరాయి. అటు డెరివేటివ్ సిరీస్‌‌ ముగింపు నేపథ్యంలో సిరీస్‌ దాదాపు అన్ని రంగాల షేర్లులో అమ్మకాలు  కొనసాగుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top