మూడో రోజు భారీ లాభాలు, రికార్డు ముగింపు

Sensex ends At Record Highs  - Sakshi

సాక్షి, ముంబై:  స్టాక్‌ మార్కెట్లో వరుసగా మూడో రోజూ  కూడా భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంనుంచి జోరుగా ఉన‍్న కీలక సూచీలు బుధవారం మరో జీవితకాల గరిష్టాలను నమోదు చేసాయి. ఇంట్రా డేలో 700పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ 50,472  వద్ద ఆల్‌టైం గరిష్టాన్ని తాకింది.  అనంతరం  అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా చివరకు 458 పాయింట్ల లాభంతో 50256 వద‍్ద 50 వేల మార్క్‌కు ఎగువన ముగియడం విశేషం.  నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ కూడా రికార్డుస్థాయిలను నమోదు చేశాయి. 14, 840   స్థాయిని టచ్‌ చేసిన నిఫ్టీ చివరకు 142 పాయింట్ల లాభంతో 14789 వద్ద ముగిసింది. . పీఎస్‌యూబ్యాంకులు, ఫార్మ, మెటల్‌ రంగ షేర్లుమెరుపులు మెరిపించాయి.  ఫార్మా ఇండెక్స్ 3 శాతానికి పైగా ర్యాలీ  అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 9.3 శాతం ఎగిసిటాప్‌ గెయినర్‌గా ఉంది. డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా, దివీస్‌, ల్యాబ్స్  సిప్లా  4-5 శాతం చొప్పున  లాభపడగా, పవర్‌ గ్రిడ్‌, ఎం అండ్‌ ఎం టాటా స్టీల్, హిందాల్కో జేఎస్‌డబ్ల్యు స్టీల్ 2-3 శాతం లాభాలతో ముగిసాయి.  మరోవైపు, శ్రీ సిమెంట్స్, మారుతి సుజుకి , నెస్లే  స్వల్పంగా నష్టపోయాయి.

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top