అక్రమ హెచ్‌టీబీటీ పత్తిసాగుపై చర్యలు తీసుకోవాలి

Seed industry cries foul over rising sales of unapproved HTBt cotton - Sakshi

విత్తన పరిశ్రమ డిమాండ్‌

న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా హెచ్‌టీబీటీ పత్తి విత్తనాల సాగు ఒక్కసారిగా ఊపందుకోవడంపై ఫెడరేషన్‌ ఆఫ్‌ సీడ్‌ ఇండస్ట్రీస్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐఐ), నేషనల్‌ సీడ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఏఐ) ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల పర్యావరణంతోపాటు రైతులకు,  చట్టబద్ధమైన విత్తన కంపెనీలకు, ప్రభుత్వాల ఆదాయానికి నష్టమని అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. నాణ్యమైన విత్తనాలతోనే దిగుబడి మెరుగ్గా ఉంటుందన్న వాస్తవాన్ని గుర్తు చేశాయి. గతేడాది 25 లక్షల ప్యాకెట్ల హెచ్‌టీబీటీ కాటన్‌ విత్తనాలను సాగు చేయగా.. ఈ ఏడాది 70 లక్షల ప్యాకెట్లకు పెరిగిపోయినట్టు రాసి సీడ్స్‌ చైర్మన్, ఎఫ్‌ఎస్‌ఐఐ చైర్మన్‌  ఎం.రామసామి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిశ్రమకు, రైతులకు ఎంతో నష్టమన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top