దేశీయంగా డిమాండ్‌కి సరిపడేంత బొగ్గును సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు కోల్ ఇండియాలో భాగమైన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ (ఎస్‌ఈసీఎల్) సీఎండీ హరీష్ దుహాన్ తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద 2.3 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ రంగం నుంచి డిమాండ్ పెరిగినా ఇవి సరిపోతాయని వివరించారు. వీటితో పాటు సత్వరం వెలికితీసేందుకు వీలుగా 1.2 కోట్ల టన్నుల బొగ్గు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అలాగే మైనింగ్ కార్యకలాపాల కోసం తగినంత స్థలం, ఇతరత్రా మైనింగ్..రవాణా కాంట్రాక్టులు కూడా ఉన్నట్లు హరీష్ తెలిపారు.
ఇక తాము సరఫరా చేసే విద్యుత్ ప్లాంట్ల వద్ద కూడా తగినన్ని బొగ్గు నిల్వలు ఉండటం వల్ల విద్యుదుత్పత్తికి అవరోధాలు లేకుండా స్థిరంగా కొనసాగేందుకు వీలవుతుందన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలో బొగ్గు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) దిగుమతులకు విఘాతం ఏర్పడి బొగ్గు, విద్యుత్ రంగాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో హరీష్ భరోసా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్‌టీపీసీ, రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్, మధ్యప్రదేశ్ పవర్ జనరేటింగ్ కంపెనీ లాంటి దిగ్గజ విద్యుదుత్పత్తి సంస్థలకు కంపెనీ బొగ్గు సరఫరా చేస్తోంది.
ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు


