Sandeep Kumar Gupta To Be Next Chairman of GAIL - Sakshi
Sakshi News home page

గెయిల్‌ కొత్త చైర్మన్‌ సందీప్‌ కే గుప్తా!

Jun 30 2022 9:06 AM | Updated on Jun 30 2022 10:12 AM

Sandeep Kumar Gupta to be next chairman of GAIL - Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ప్రస్తుతం ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్‌ కుమార్‌ గుప్తా, భారత్‌ అతిపెద్ద గ్యాస్‌ యుటిలిటీ సంస్థ గెయిల్‌ (ఇండియా) చీఫ్‌గా ఎంపికయ్యారు.

పది మంది అభ్యర్థుల ఇంటర్వ్యూ తర్వాత 56 సంవత్సరాల గుప్తాను గెయిల్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా ఎంపికచేసినట్లు ప్రభుత్వ రంగ సంస్థల నియామకాల ఎంపిక బోర్డ్‌ (పీఈఎస్‌బీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 31వ తేదీన ప్రస్తుత సీఎండీ మనోజ్‌ జైన్‌ పదవీ విరమణ అనంతరం గుప్తా నూతన బాధ్యతలను చేపడతారు.

అయితే అంతకుముందు ఆయన నియామకానికి సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ వంటి అవినీతి నిరోధక సంస్థలు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement