ఆపిల్‌పై శాంసంగ్ సెటైర్లు

Samsung Trolls Apple For Not Providing Charger With iPhone 12 - Sakshi

సాక్షి, ముంబై: పర్యావరణం, ఖర్జుల తగ్గింపు పేరుతో 2021లో చార్జర్ లేని మొబైల్ ఫోన్లు విక్రయించాలని పలు కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ తయారీ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్ కంపెనీలు ఈ దశగా అడుగులు వేస్తున్నాయనీ ఇప్పటికే పలు అంచనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఆపిల్ తాజా ఐఫోన్ 12 లో ఇయర్‌ ఫోన్స్‌ తో పాటు, చార్జర్‌ ను కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. దీనిపై ఇప్పటికే పలువురు యూజర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రత్యర్థి కంపెనీ శాంసంగ్ ఆపిల్ ను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఇది వైరల్ గా మారింది.  (యూజర్లకు షాక్ : ఐఫోన్ 12లో అవి మిస్)

శాంసంగ్ మీకు ఏం కావాలో అది ఇస్తుంది.. ముఖ్యంగా చార్జర్, ఉత్తమమైన కెమెరా, మంచి బ్యాటరీ, పనితీరు, మెమరీ, 120 హెర్ట్జ్ స్క్రీన్ వరకు అన్ని ఇస్తున్నామంటూ ఫేస్‌బుక్‌లో ఎగతాళిగా ఒక పోస్ట్ పెట్టింది.  దీంతో పాటు గెలాక్సీ ఫోన్‌ల  బ్లాక్ ఛార్జర్  ఫోటోను  కూడా షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లోభారీగా వైరల్ అయ్యింది, 70వేల లైక్స్, 10వేల కంటే ఎక్కువ ఫన్నీ కమెంట్స్ సొంతం చేసుకుంది. మరికొంతమంది భిన్నంగా స్పందించారు. మీరు రెండు సంవత్సరాల తరువాత ఇదే పని చేయబోతున్నారుగా. దానికోసం ఈ పిక్ సేవ్  చేసుకుంటానంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top