ఫోన్ల విక్రయంలో.. హైదరాబాదీలు నిజాలే చెప్తారు

Sale of pre-owned phones on rise in India amid pandemic: Cashify survey - Sakshi

14-18 నెలలకొకసారి ఫోన్లు మారుస్తున్నారు

ప్రీఓన్డ్‌ మొబైల్స్‌లో షావోమీ టాప్‌ బ్రాండ్‌

20 శాతం వాటాతో యాపిల్‌ సెకండ్‌ ప్లేస్‌

ఐఫోన్‌-7, రెడ్‌మీ నోట్‌ 4, వన్‌ప్లస్‌ 6 హాటెస్ట్‌ ఫోన్స్‌

క్యాషిఫై యూజర్‌ బిహేవియర్‌ రిపోర్ట్‌ వెల్లడి  

సెకండ్‌ హ్యాండ్‌లో స్మార్ట్‌ఫోన్‌ అన్‌ లైన్‌లో కొనాలంటే మనకొచ్చే మెయిన్‌ డౌట్‌ కొన్నాక ఫోన్‌ సరిగా పనిచేస్తుందో లేదోనని? అయితే ప్రీఓన్ట్‌ మొబైల్స్‌ విక్రయం విషయంలో మాత్రం హైదరాబాదీలు అన్ని వివరాలు పక్కాగా, నిజాలే చెబుతారంట. యూజ్జ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ విక్రయాలలో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల వినియోగదారులు 'టాప్‌ సెల్లింగ్‌ జాబితాలో నిలిస్తే.. హైదరాబాద్‌ చెన్నైవాసులు మాత్రం 'ట్రూత్‌ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు. స్మార్ట్‌ఫోన్ల అమ్మకంలో వాస్తవ పరిస్థితిని అత్యంత నిజాయితీగా వివరిస్తున్నారని అన్‌ లైన్‌లో యూజ్జ్‌ ఫోన్లను విక్రయించే కంపెనీ క్యాషిఫై పేర్కొంది. 

ఘజియాబాద్‌, ఫరీదాబాద్‌ అహ్మదాబాద్‌ లక్నో వంటి శాటిలైట్‌ టౌన్స్‌లలోను సెకండ్స్‌ మొబైల్స్‌ మార్కెటక డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోతుంది. 2020లో ప్రీఓన్ట్‌ ఫోన్లు అత్యధిక రిపేర్లు కలిగిన నగరంలో ఢిల్లీ నిలిచిందని క్యాషిఫై 'యూజర్‌ బిహేవియర్‌ వైట్‌పేపర్‌ ఐదవ వార్షిక నివేదిక వెల్లడించింది. టాప్‌ బ్రాండ్‌ షావోమీ, యాపిల్‌ ప్రపంచ ప్రీఓన్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఇండియా రెండో అతిపెద్ద దేశం. దేశంలో సగటు భారతీయుడు స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన 14-18 నెల ఒకసారి అప్‌గ్రేడ్‌ కోసం చూస్తున్నారని క్యాషిఫై కో-ఫొండర్‌ అండ్‌ సీఓఓ నకుల్‌ కుమార్‌ తెలిపారు. 

హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీ(3జీ నుంచి 4జీ), ఆన్‌లైన్‌ తరగతుల కోసం ఎక్కవగా ప్రీఓన్డ్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2020లో సెకండ్‌హ్యాండ్‌ ఫోన్లు ఎక్కువ విక్రయమైన బ్రాండ్లలో 26 శాతం వాటాతో షావోమీ అగ్రస్థాసంలో నిలవగా... 20 శాతంతో యాపిల్‌, 16 శాతంతో శామ్‌సంగ్‌, వివో, మోటరోలా (ఒక్కోటి 6 శాతం) వరుసగా తర్వాతి స్థానాలలో నిలిచాయి. రూ.10 వేల లోపు ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లనే వినియోగదారులు ఎక్కవగా విక్రయించారు. ఐఫోన్‌-7, రెడ్‌మీ నోట్‌ 4, వన్‌ప్లస్‌ 6 హాటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లలో జాబితాలో నిలిచాయి. కనీసం మూడేళ్ల వయసున్న ఫోన్లు, సగటున రూ.4,217లకు ప్రీఓన్డ్‌ ఫోన్లను విక్రయించారు.

చదవండి: స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు చేదువార్త!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top