టీసీఎస్‌కి న్యాయస్థానంలో చుక్కెదురు !

Sacked TCS employee won the long battle in court Against TCS - Sakshi

ఉద్యోగికి పట్ల టీసీఎస్‌ న్యాయస్థానం ప్రవర్తించిన తీరు పట్ల చెన్నై సిటీ కార్మిక న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్థరహితమైన కారణాలు చెప్పి ఉద్యోగులు జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించింది. ఈ మేరకు సదరు ఉద్యోగికి జరిగిన అన్యాయం సరి చేయాలంటూ తీర్పు వెలువరించింది.

తిరుమలై సెల్వన్‌ (48) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో మేనేజర్‌ హోదాలో పని చేస్తున్న సమయంలో ఊహించిన విధంగా యాజమాన్యం ప్రవర్తించింది. సరైన కారణాలు పేర్కొనకుండా అతన్ని ఫ్రీలాన్సర్‌గా మారమంటూ ఒత్తిడి తెచ్చింది. దీంతో గడిచిన ఏడేళ్లుగా అతను ఫ్రీలాన్సర్‌గా పని చేస్తూ నెలకు కేవలం రూ. 10,000 జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కుటంబం గడిచేందుకు అతని భార్య కూడా పని చేస్తోంది.

సరైన కారణాలు పేర్కొనకుండా తనను ఉద్యోగంలోంచి తొలగించారంటూ తిరుమలై సెల్వన్‌ చెన్నైలోని లేబర్‌కోర్టును ఆశ్రయించాడు. అతనికి మద్దతుగా ది ఫోరమ్‌ ఫర్‌ ఐటీ ఎంప్లాయిస్‌ కూడా నిలబడింది. ఇలా ఏడేళ్లలో 150 సార్లు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. మొత్తంగా ఉద్యోగంలోకి తీసుకున్న వ్యక్తిని సరైన కారణాలు చూపకుండా తొలగించడం తప్పని చెబుతూ న్యాయస్థానం తాజాగా తీర్పు ఇచ్చింది. 

సెల్వన్‌కు వ్యతిరేకంగా టీసీఎస్‌ తరఫున వినిపించిన వాదనలుఅ అర్థరహితమంటూ వ్యాఖ్యానించింది. ఒక ఉద్యోగిగా సెల్వన్‌ నష్టపోయిన కాలానికి సంబంధించి పూర్తి పరిహారాన్ని జీతం, ఇతర బెనిఫిట్స్‌తో సహా చెల్లించాలని టీసీఎస్‌ను న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు అతన్ని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పింది. కోర్టు తీప్పు పట్ల ఐటీ ఎంప్లాయిస్‌ ఫోరం హర్షం వ్యక్తం చేసింది. 
 

చదవండి:  రెండు వారాలు ఇంటినుంచే పని

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top