హైదరాబాద్‌లో అద్దె ఇళ్లకు డిమాండ్‌ | Rise In Demand For Residential Rentals In Hyderabad From April To June Q2 In 2023 - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అద్దె ఇళ్లకు డిమాండ్‌

Published Wed, Aug 23 2023 6:17 AM

Rise in demand for residential rentals in Hyderabad - Sakshi

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో అద్దె ఇళ్లకు డిమాండ్‌ బలంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల కాలంలో (2023లో క్యూ2) అంతకుముందు మూడు నెలలతో పోలిస్తే అద్దె ఇళ్లకు డిమాండ్‌ (అన్వేషణ) 22 శాతం పెరిగింది. అదే సమయంలో అద్దె ఇళ్ల సరరా జూన్‌ త్రైమాసికంలో అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 2.1 శాతం తగ్గింది. సగటు అద్దె ధరల్లో త్రైమాసికం వారీగా 4.5 శాతం పెరుగుదల నమోదైంది. ఈ వివరాలను ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్‌ఫామ్‌ మ్యాజిక్‌బ్రిక్స్‌ ‘రెంటల్‌ ఇండెక్స్, ఏప్రిల్‌–జూన్‌ 2023’ను విడుదల చేసింది.

► గచ్చిబౌలి, కొండాపూర్‌ ఈ రెండూ హైదరాబాద్‌లో ఎక్కువ మంది అద్దె ఇళ్ల కోసం అన్వేషిస్తున్న ప్రాంతాలుగా (మైక్రో మార్కెట్‌) ఉన్నాయి. కీలకమైన ఉపాధి కేంద్రాలకు ఇవి సమీపంగా ఉండడం, ఓఆర్‌ఆర్‌కు సైతం చక్కని అనుసంధానత కలిగి ఉండడం అనుకూలతలుగా మ్యాజిక్‌బ్రిక్స్‌ పేర్కొంది.  
► భాగ్యనగరంలో ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమైన ప్రాంతాల్లో (ప్రైమ్‌ లొకాలిటీస్‌) 2బీహెచ్‌కే ఇంటి అద్దె ధరలు రూ.20,000–32,000 మధ్య ఉంటే, 3బీహెచ్‌కే ధరలు రూ.30,000–45,000 మధ్య ఉన్నాయి.  
► కిరాయిదారులు ఫరి్న‹Ù్డ 2బీహెచ్‌కే ఇళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. మొత్తం మార్కెట్లో ఫరి్న‹Ù్డ 2బీహెచ్‌కే యూనిట్ల వాటాయే 55 శాతంగా ఉంటోంది. 1 బీహెచ్‌కే ఇళ్ల డిమాండ్‌ 23 శాతంగా ఉంటే, 3 బీహెచ్‌కే ఇళ్ల డిమాండ్‌ 20 శాతం చొప్పున ఉంది.  
► కానీ, 2బీహెచ్‌కే ఇళ్ల సరఫరా 58 శాతం ఉంటే, 1 బీహెచ్‌కే 13 శాతం, 3బీహెచ్‌కే 25 శాతం, అంతకుమించిన ఇళ్ల సరఫరా 4 శాతం చొప్పున ఉంది.
► ముఖ్యంగా రూ.10,000–20,000 మధ్య అద్దె లున్న ఇళ్లకే 55 శాతం మంది మొగ్గు చూపిస్తున్నారు. ఆ తర్వాత 19 శాతం ఆసక్తి రూ.20,000 –30,000 మధ్య ధరలశ్రేణి ఇళ్లకు ఉంది.  
► అది కూడా 1,000–1,500 చదరపు అడుగుల ఇళ్లకే 50 శాతం డిమాండ్‌ ఉంది. కానీ, వీటి సరఫరా 39 శాతంగానే ఉంది.  


అద్దె ఇళ్లకు డిమాండ్‌ 18 శాతం
దేశవ్యాప్తంగా 13 ప్రముఖ పట్టణాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్‌ జూన్‌ త్రైమాసికంలో, ఏప్రిల్‌ త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 18.1 శాతం పెరిగినట్టు మ్యాజిక్‌బ్రిక్స్‌ తెలిపింది. అదే సమయంలో సరఫరా చూస్తే 9.6 శాతమే పెరిగిందని.. ఇళ్ల అద్దెలు 4.9 శాతం ఎగిసినట్టు మ్యాజిక్‌ బ్రిక్స్‌ తన రెంటల్‌ ఇండెక్స్‌ నివేదికలో వెల్లడించింది. మ్యాజిక్‌ బ్రిక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై 2 కోట్ల మంది కస్టమర్ల అన్వేషణ, ప్రాధాన్యతల ఆధారంగా ఈ వివరాలను రూపొందించింది.

త్రైమాసికం వారీగా (సీక్వెన్షియల్‌గా) చూస్తే బెంగళూరులో 8.1 శాతం, నవీ ముంబైలో 7.3 శాతం, గురుగ్రామ్‌లో 5.1 శాతం చొప్పున అద్దెలు పెరిగాయి. ఢిల్లీ, ముంబైలో మాత్రం నికరంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో అద్దె ఇళ్లకు డమాండ్‌ అత్యధికంగా 27.25 శాతం పెరగ్గా, ఆ తర్వాత అత్యధిక డిమాండ్‌ హైదరాబాద్‌ మార్కెట్లోనే (22 శాతం) నమోదైంది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో 18.35 శాతం, పుణెలో 19.3 శాతం, బెంగళూరులో 12.8 శాతం చొప్పున డిమాండ్‌ పెరిగింది.

13 పట్టణాల్లో మొత్తం డిమాండ్‌లో ఒకటి, రెండు పడక గదుల ఇళ్లకే 80 శాతం మేర ఉంది. 53 శాతం డిమాండ్‌ 2బీహెచ్‌కే ఇళ్లకు ఉంది. సరఫరా కూడా ఈ విభాగంలోనే ఎక్కువగా ఉంది. ‘‘గడిచిన ఏడాది కాలంలో ప్రముఖ పట్టణాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండడం, విద్యార్థుల రాక ఇందుకు మద్దతుగా ఉంది. ప్రాపరీ్టల విలువలు గణనీయంగా పెరిగిపోవడంతో వాటిని అద్దెకు ఇవ్వడం కంటే విక్రయించే అవకాశాలను యజమానులు సొంతం చేసుకున్నారు. ఇది సరఫరా తగ్గేందుకు దారితీసింది. దీనికితోడు అధిక డిమాండ్‌తో కొన్ని పట్టణాల్లో చెప్పుకోతగ్గ అద్దెలు పెరిగాయి’’అని మ్యాజిక్‌బ్రిక్స్‌ సీఈవో సు«దీర్‌ పాయ్‌ వివరించారు.  

హెదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో అద్దెలు
ప్రాంతం         2బీహెచ్‌కే        3బీహెచ్‌కే 
గచ్చిబౌలి       24,000        35,000
కొండాపూర్‌    21,000         30,000
హైటెస్‌ సిటీ    32,000         47,000
మాధాపూర్‌    21,000        30,000
కోకాపేట్‌        23,000         33,000
నార్సింగి        22,000         32,000
కూకట్‌పల్లి     16,000         23,000
బంజారాహిల్స్‌ 20,000        30,000
నల్లగండ్ల        21,000        30,000
జూబ్లీహిల్స్‌    23,000         33,000
మణికొండ    17,000          24,000


నోట్‌: 2బీహెచ్‌కే 900 ఎస్‌ఎఫ్‌టీ చదరపు అద్దె
3బీహెచ్‌కే 1300 ఎస్‌ఎఫ్‌టీ చదరపు అద్దె

Advertisement

తప్పక చదవండి

Advertisement