టెక్‌ టమారం : ఎగిరిపోయే సెల్ఫీ కెమెరాలు వచ్చేశాయి..ధరెంతంటే?! | Sakshi
Sakshi News home page

టెక్‌ టమారం : ఎగిరిపోయే సెల్ఫీ కెమెరాలు వచ్చేశాయి..ధరెంతంటే?!

Published Sun, Jul 9 2023 7:17 AM

Review On Hover Camera X1 - Sakshi

స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు తీసుకోవడం అందరికీ తెలిసిన సంగతే! స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీలు తీసుకోవడంలో చాలా పరిమితులు ఉన్నాయి. పరిమితమైన భంగిమల్లోనే ఫొటోలు తీసుకోవడం సాధ్యమవుతుంది. సెల్ఫీలను మరింత చక్కగా, స్పష్టంగా తీసుకునేందుకు వీలైన డ్రోన్‌ కెమెరాను అమెరికన్‌ కంపెనీ ‘హోవర్‌’ ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది.

అరచేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉండే ఈ డ్రోన్‌ కెమెరా చాలా తేలికగా కూడా ఉంటుంది. దీని బరువు 125 గ్రాములు మాత్రమే. దీనిని అరచేతి నుంచే టేకాఫ్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ ద్వారా దీని కదలికలను నియంత్రించవచ్చు. ఇందులో క్విక్‌షాట్‌ మోడ్‌ను ఎంపిక చేసుకుంటే, వెంట వెంటనే సెల్ఫీ ఫొటోలు, వీడియోలు తీస్తుంది.

ఫాలో మోడ్‌ను ఎంపిక చేసుకుంటే, మనం కోరుకున్న చోటుకు అనుసరిస్తూ వీడియోలు చిత్రిస్తుంది. ఇది తీసే ఫొటోలను, వీడియోల ప్రీవ్యూలను మొబైల్‌లో లైవ్‌లో చూసుకోవచ్చు. ‘హోవర్‌ కెమెరా ఎక్స్‌1’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ కెమెరా వీడియో బ్లాగర్లకు, ఔత్సాహిక ఫిలిమ్‌ మేకర్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని ధర 389 డాలర్లు (రూ.31,924) మాత్రమే! 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement