‘యూనివర్సల్ బ్యాంకు’ దరఖాస్తు తిరస్కరణ
ముంబై: యూనివర్సల్ బ్యాంక్‌గా కార్యకలాపాలను విస్తరించేందుకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌నకు (జేఎస్‌ఎఫ్‌బీ) ఆర్‌బీఐ షాకిచ్చింది. నిర్దేశిత అర్హతా నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో అప్లికేషన్‌ను వెనక్కి పంపింది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ నిర్దిష్ట కారణాలేమీ పేర్కొనలేదని బ్యాంక్ ఎండీ అజయ్ కన్వల్ తెలిపారు. ఆర్‌బీఐ అధికారులతో చర్చించి, కారణాలు తెలుసుకుంటామన్నారు.
తగు దిద్దుబాటు చర్యలు తీసుకుని, తిరిగి దరఖాస్తు చేసుకుంటామన్నారు. ఇందుకు ఎంత సమయం పడుతుందనేది వెల్లడించలేదు. ప్రస్తుతం తాము దాదాపుగా యూనివర్సల్ బ్యాంక్ తరహాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున, తమ దరఖాస్తు తిరస్కరణ వల్ల అసెట్స్‌పై ప్రభావమేమీ ఉండదని కన్వల్ చెప్పారు.
బీఎస్‌ఈలో మంగళవారం జేఎస్‌ఎఫ్‌బీ షేరు 2 శాతం క్షీణించి రూ. 448 వద్ద క్లోజయ్యింది.


