గూగుల్‌ పే, ఫోన్‌ పే యూజర్లకు గట్టి షాక్‌.. రెడీగా ఉండండి!

Rbi Plans To Charge Payments Through Upi Need Public Feedback - Sakshi

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రతిదీ డిజిటల్లోకి మారుతోంది. నోట్ల రద్దు నాడు మొదలైన డిజిటల్‌ ట్రెండ్‌ ముఖ్యంగా కరోనా రాకతో డబ్బులు మార్పిడి తగ్గి ఫటా ఫట్‌మంటూ యూపీఐ లావాదేవీల వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఇదేదో బాగుందనుకుని అప్పటి నుంచి నగదు లావాదేవీల కొరకు ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి యాప్‌లను తెగ వాడుతున్నారు. ఎంతలా అంటే చిన్న షాపు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు చెల్లింపులు మొత్తం యూపీఐ ద్వారానే జరగుతున్నాయి. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ, ఫ్రీగా లావాదేవీలకు అలవాటు పడిపోయిన వారికి కేంద్రం గట్టి షాక్‌ ఇవ్వబోతోంది.

ఇకపై యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థలో ఫీజులు, ఛార్జీలు విధించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్‌ 3 లోపు ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను కోరింది. సాధారణంగా క్రెడిట్‌ కార్డు వాడితే ఎండీఆర్‌(MDR) ఛార్జీలు వేస్తారు. దీన్ని బ్యాంకులతో పాటు కార్డు జారీ కంపెనీలు పంచుకుంటాయి.

ఇదే తరహాలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తే, సంబంధిత సంస్థలు మరింత సమర్ధంగా సేవలు అందిస్తాయని ఆర్బీఐ యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే యూపీఐ యాప్‌లను వినియోగించే వారికి పెద్ద షాక్ తగలనుంది. దేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫాంగా యూపీఐ పేరు సంపాదించింది.  నగదు బదిలీలతో పాటు వ్యాపార చెల్లింపులు కలిపి ప్రతి నెలా 6 బిలియన్ల లావాదేవీలు, రూ. 10 ట్రిలియన్ల వరకు లావాదేవీలు యూపీఐ ద్వారానే జరగుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం 2022 మొదటి త్రైమాసికంలో 64%, విలువ పరంగా 50% మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి

చదవండి: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తక్కువ ధరకే ఏసీ ప్రయాణం, వచ్చేస్తోంది!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top