బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. కెవైసీ గడువు పొడిగించిన ఆర్‌బీఐ! | RBI extends the deadline for periodic KYC updates till March 31 | Sakshi
Sakshi News home page

బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. కెవైసీ గడువు పొడిగించిన ఆర్‌బీఐ!

Dec 30 2021 4:20 PM | Updated on Dec 30 2021 5:48 PM

RBI extends the deadline for periodic KYC updates till March 31 - Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. కెవైసీ అప్‌డేట్ గడువును మార్చి 31, 2022 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. కోవిడ్-19 కొత్త రకం ఓమిక్రాన్ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతంలో ఈ గడువు డిసెంబర్ 31, 2021 వరకు ఉండేది. "కోవిడ్-19 కొత్త రకం ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా కెవైసీ అప్‌డేట్ గడువును మార్చి 31, 2022 వరకు వరకు పొడగించినట్లు" అని సెంట్రల్ బ్యాంక్ గురువారం తెలిపింది. కెవైసీ ప్రక్రియలో భాగంగా ఖాతాదారులు బ్యాంకులకు తమ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది.

కోవిడ్-19 కారణంగా కెవైసీ అప్‌డేట్ చేయని కస్టమర్ ఖాతాల విషయంలో ఎలాంటి పరిమితి ఉండదని ఆర్‌బీఐ తెలిపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002, మనీ లాండరింగ్ నిరోధక(రికార్డుల నిర్వహణ) నియమాలు-2005 నిబంధనల పరంగా ఖాతాదారుల కెవైసీ అప్‌డేట్ ఆర్‌బీఐ 2016లో నియంత్రిత సంస్థలను ఆదేశించింది. కేవైసీ కేవలం బ్యాంకింగ్ లావాదేవీలకు మాత్రమే కాదు, నగదుతో ముడిపడి ఉన్న అన్ని లావాదేవీలకు కేవైసీ చేయాల్సి ఉంటుంది. రిస్కు తక్కువగా ఉన్న ఖాతాలకు ప్రతి పదేళ్లకు ఒకసారి కేవైసీ అప్‌డేట్ చేయాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. ఎక్కువ రిస్క్ ఉన్న అకౌంట్ హోల్డర్స్ ప్రతి రెండేళ్లకు ఒకసారి కేవైసీని అప్‌డేట్ట్ చేయాలి. ఎక్కువ కాలం పాటు ఇన్‌యాక్టివ్‌లో ఉన్న, రీయాక్టివేట్‌ కావాల్సిన డోర్మాట్ బ్యాంకు ఖాతాలు కూడా కేవైసీని అప్‌డేట్ చేయాలి. ఒకవేళ కేవైసీ అప్‌డేట్ చేయకపోతే భవిష్యత్‌లో బ్యాంకులు కస్టమర్ల ఎలాంటి లావాదేవీలు చేయకుండా నిలిపివేస్తాయి. 

(చదవండి: హ్యుందాయ్‌ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ కార్లకు స్వస్తి..!)

Advertisement
 
Advertisement
Advertisement