కరెన్సీ నోట్లపై బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు!

Rbi Asks Banks To Test Note Sorting Machines On Every 3 Months - Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) బ్యాంక్‌లకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకుల్లో ఒరిజినల్‌ నోట్లు,ఫేక్‌ నోట్‌ల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తాము నిర‍్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా కరెన్సీ నోట్ల ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు ప్రతి 3 నెలలకు ఒకసారి నోట్‌ సార్టింగ్ మెషీన్‌లను (డబ్బులు లెక్కించే యంత్రం) పరీక్షించాలని ఆర్‌బీఐ తెలిపింది.  

2016 నవంబర్‌ నెలలో కేంద్రం పెద్దనోట్లను రద్దు చేసింది. నాటి నుంచి ఆర్బీఐ కొత్త రూ.200, రూ.500, రూ.2000నోట్ల సిరీస్‌ను విడుదల చేస‍్తుంది. అయితే కొత్త సిరీస్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆర్బీఐ నోట్ల ప్రామాణీకరణ,బ్యాంకుల్లో డబ్బులు లెక్కించే ఫిట్‌నెస్ సార్టింగ్ మెషిన్‌ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలుపుతూ కొత్త మార్గ దర్శకాల్ని విడుదల చేసింది. 

'నోట్ సార్టింగ్ మెషీన్స్ అథెంటికేషన్, ఫిట్‌నెస్ సార్టింగ్ పారామీటర్స్' అనే ఆర్బీఐ మార్గ దర్శకాల ప్రకారం..ఫిట్ నోట్ అనేది "వాస్తవమైన, తగినంత శుభ్రంగా ఉండే నోటు. రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది" అని పేర్కొంది.

నోటు భౌతిక స్థితిని బట్టి..రీసైక్లింగ్‌కు పనికొస్తాయా? లేదంటే ఆ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దశలవారీగా తొలగించి వాటి స్థానంలో కొత్త నోట్లను తయారు చేయించనుంది. 
 
రీసైక్లింగ్‌కు అనువుగా ఉన్న నోట్లను తప్పని సరిగా వినియోగించాలని బ్యాంకులకు తెలిపింది. లేదంటే రీ సైక్లింగ్‌ చేయించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.    

నోట్ సార్టింగ్ మెషీన్స్ ఫేక్‌ కరెన్సీ నోట్లు, చెలామణికి పనికి రాని నోట్లను గుర్తించి, వాటిని వేరు చేయగలగాలి.

ఇలా కరెన్సీ నోట్లను చెక్‌ చేసి సంబధిత వివరాల్ని ఆర్బీఐకి పంపాలని తెలిపింది. అలాగే చినిగిపోయిన నోట్లు, నకిలీ నోట్లను అన్‌ఫిట్ నోటు కేటగిరి కింద ఉంచాలని పేర్కొంది. వీటిని బ్యాంకులు తప్పని సరిగా అమలు చేయాలని ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top