
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముంబై మెట్రో కార్పొరేషన్‌కు చెందిన నారిమన్ పాయింట్‌లోని టోనీ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4.16 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. దీనికోసం ఆర్‌బీఐ ఏకంగా రూ. 3472 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ భూమిని ఎందుకు కొనుగోలు చేసిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
ముంబైలోని నారిమన్ పాయింట్ అనేది దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం. దీనిని ప్రీమియం వ్యాపార కేంద్రంగా పరిగణిస్తారు. ఇలాంటి ప్రదేశంలో ఆర్‌బీఐ భూమిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద డీల్స్‌లో ఇది ఒకటి కావడంతో.. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఈ ఏడాది జరిగిన అతిపెద్ద భూమి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనించదగ్గ విషయం.
ఇదీ చదవండి: ఉద్యోగంలో చేరి రెండు రోజులే.. జాబ్ నుంచి తీసేసారు
రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ అయిన సీఆర్ఈ మ్యాట్రిక్స్ నుంచి సేకరించిన ఆస్తి లావాదేవీ డేటా ప్రకారం.. ఆర్‌బీఐ కొనుగోలు చేసిన భూమి కోసం రూ. 208 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించింది. ఈ ఒప్పందం సెప్టెంబర్ 5న రిజిస్టర్ అయింది. రిజర్వ్ బ్యాంక్ తన హెడ్‌క్వార్టర్స్‌ను విస్తరించాలనే ప్రణాళికలో భాగంగానే ఈ భూమిని కొనుగోలు చేసింది.