ప్యాసివ్‌ పెట్టుబడులకు ఆదరణ | Popularity of passive investments | Sakshi
Sakshi News home page

ప్యాసివ్‌ పెట్టుబడులకు ఆదరణ

Jul 28 2025 5:51 AM | Updated on Jul 28 2025 8:15 AM

Popularity of passive investments

ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్‌లతో మరింత అందుబాటులోకి

గత కొన్నేళ్లుగా, దేశీయంగా ప్యాసివ్‌ తరహా పెట్టుబడులకు ఆదర ణ పెరుగుతోంది. మ్యుచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫీ తాజా నివేదిక ప్రకారం 2025 జూన్‌ నాటికి ప్యాసివ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల ఏయూఎం రూ. 12 లక్షల కోట్లుగా ఉంది. ఇది నెలవారీగా 3% వృద్ధిని, మొత్తం మ్యుచువల్‌ ఫండ్‌ పరిశ్రమ ఏయూఎంలో (నిర్వహణలోని ఆస్తులు) 17 శాతాన్ని ప్రతిబింబిస్తుంది. 

సంపద సృష్టి విషయంలో భారతీయ ఇన్వెస్టర్ల ధోరణుల్లో ఫండమెంటల్‌గా చోటు చేసుకుంటున్న మార్పునూ సూచిస్తోంది. ఒకప్పుడు చాలా నైపుణ్యాలు అవసరమ య్యే లేదా అనుబంధ వ్యూహంగానో పరిగణించిన ప్యాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహాలు  ఇప్పుడు క్రమంగా ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోల్లో కీలక భాగంగా మారుతు న్నాయి. సరళంగా, పారదర్శకంగా, తక్కువ ఖర్చులతో కూడుకున్నవిగా ఉండటం వల్లే కొత్త తరం ఇన్వెస్టర్లకు ఇవి బాగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి. 
 
క్రమంగా ముందుకు ..  
భారత్‌లో ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌ ప్రస్థానమనేది క్రమంగా, అనేక మైలురాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. 2010 తొలినాళ్లలో రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్స్‌ అనేవి అంతగా తెలియదు. ప్రధానంగా నిఫ్టీ50, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఆధారితమై, ప్రోడక్టు పరిధి చాలా పరిమితంగా ఉండేది. ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌పై ఇన్వెస్టర్లకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. సంప్రదాయ యాక్టివ్‌ ఫండ్స్‌ వైపే మొగ్గు చూపే వారు.

 దీనితో ప్యాసివ్‌ ఫండ్స్‌ పక్క వాయిద్యాలుగానే ఉండిపోయేవి. అయితే, ఈటీఎఫ్‌ల ద్వారా డిజిన్వెస్ట్‌ చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో పాటు ఈక్విటీ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేయాలన్న ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయంతో ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌పై ఫోకస్‌ పెరిగింది. నియంత్రణ సంస్థ సెబీ కూడా ఈ తరహా ఇన్వెస్టింగ్, నిర్వహణను సరళతరం చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది.  ఫలితంగా మ్యుచువల్‌ ఫండ్‌ కంపెనీలు ఇప్పుడు విస్తృత స్థాయిలో ప్యాసివ్‌ ఫండ్స్‌ను అందిస్తున్నాయి. 

ఇక, ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫాంలు పెరగడం కూడా ఈ ప్రోడక్టులు మరింతగా అందుబాటులోకి రావడానికి తోడ్పడింది. ఇన్వెస్టర్లు ఇప్పుడు యాప్‌ల ద్వారా సులువుగా ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్స్‌ను కొనుక్కోగలుగుతున్నారు. ట్రాక్‌ చేయగలుగుతున్నారు. ఆ విధంగా ఇన్వెస్టింగ్‌ మరింత అందుబాటులోకి, యూజర్లకు మరింత అనుకూలమైనదిగాను మారింది. నియంత్రణ సంస్థపరమైన మద్దతు, సంస్థాగత భాగస్వామ్యం, ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌పై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించేందుకు అసెట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమ కృషి, సాంకేతిక ఆవిష్కరణల మేళవింపు కలిసి ప్యాసివ్‌ ఫండ్స్‌ను అన్ని వర్గాలకు అనువైన ఓ పెట్టుబడి సాధనంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.  

తక్కువ వ్యయాలు.. 
ప్యాసివ్‌ ఫండ్స్‌ ప్రాచుర్యంలోకి రావడానికి ఒకానొక కారణం, ఇవి తక్కువ వ్యయాలతో కూడుకున్నవి కావడమే. ఈటీఎఫ్‌లు, ఇండెక్స్‌ ఫండ్స్‌ వ్యయ నిష్పత్తులు, మిగతా పెట్టుబడి సాధనాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వ్యయాల గురించి ఆలోచించే ఇన్వెస్టర్లకు ఇవి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. మార్కెట్లో విస్తృత స్థాయిలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉండటం, ఒకే సాధనంపై మొత్తం ఇన్వెస్ట్‌ చేయడం మూలంగా వచ్చే రిసు్కలను తగ్గించడం, మార్కెట్‌ వృద్ధిలో స్థిరంగా పాలుపంచుకునే అవకాశం కల్పించడం వంటివి వీటికి సానుకూలాంశాలు. 

డిజిటల్‌ విప్లవం కూడా ప్యాసివ్‌ ఫండ్స్‌కు దన్నుగా నిలిచింది. ఫిన్‌టెక్‌లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలు, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియను సరళతరం చేశాయి. ‘సాషే ఇన్వెస్టింగ్‌’, అంటే  సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ (సిప్‌లు) ద్వా రా చిన్న మొత్తాల్లో, క్రమం తప్పకుండా ప్యా సివ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశం కల్పించాయి. తొలిసారిగా ఇన్వెస్ట్‌ చేసే వారికి ఎంట్రీపరమైన అవరోధాలు తగ్గేందుకు ఇది దోహదపడింది. క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టే ధోరణిని పెంపొందించింది. అంతేగాకుండా, వివిధ డి్రస్టిబ్యూషన్‌ మోడల్స్‌ కూడా ప్యాసివ్‌ ఫండ్స్‌ను మెట్రోలు, పట్టణ కేంద్రాల పరిధిని దాటి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా మరింత చేరువ చేశాయి.

కొత్త ఆవిష్కరణలు.. 
ప్యాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది కేవలం విస్తత మార్కెట్‌ సూచీలకే పరిమితం కావడం లేదు. లో వోలటైలిటీ, క్వాలిటీ, వేల్యూ, లేదా మొమెంటంలాంటి అంశాల ప్రాతిపదికన ఉండే సూచీలను ట్రాక్‌ చేసే స్మార్ట్‌ బీటా ఫండ్స్‌లాంటి ఆవిష్కరణలు వచ్చాయి. మరింత అధునాతనమైన ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌ విధానాన్ని అందిస్తున్నాయి. ఇంటర్నేషనల్‌ ఈటీఎఫ్‌లనేవి నేరుగా విదేశాల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి ఉండే సంక్లిష్టతల బాదరబందీ లేకుండా భారతీయ ఇన్వెస్టర్లు అంతర్జాతీయంగా పెట్టుబడులను డైవర్సిఫై చేసేందుకు, విదేశీ మార్కెట్లు మరియు కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టేందుకు తోడ్ప డుతున్నాయి.

 హెల్త్‌కేర్, కన్జంప్షన్‌లాంటి థీమ్‌ల ఆధారితమైన థీమ్యాటిక్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌ తరహాలోనే కమోడిటీల (గోల్డ్, సిల్వర్‌) ఆధారిత ఈటీఎఫ్‌లు, ఎఫ్‌వోఎఫ్‌లు కూడా ఇన్వెస్టర్లను ఆక ర్షిస్తున్నాయి. ప్యాసివ్‌ ఫండ్స్‌ ఆధిపత్యం పెరుగు తుండటమనేది భారత్‌లో అసెట్‌ మేనేజ్‌మెంట్‌ పరిశ్రమ రూపురేఖలను మారుస్తోంది. ఏఎంసీలు తమ ప్యాసివ్‌ ప్రోడక్ట్‌లను విస్తరిస్తున్నాయి. ప్యాసివ్‌ వ్యూహాలను తగిన విధంగా ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చనే దానిపై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించడంపై ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి.

 పారదర్శకత, తక్కువ వ్యయాలతో అధిక ప్రయోజనాలను అందించడం, దీర్ఘకాలికంగా సంపద సృష్టించడం, ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చేలా పనిచేయడం, వారి ప్రయోజనాలే పరమావధిగా పనిచేయడం వైపుగా పరిశ్రమ మళ్లుతోంది. ప్యాసివ్‌ ఇన్వెస్టింగ్‌ మరింత పుంజుకోవాలంటే, ఈ కోవకు చెందిన ఫండ్స్‌లో పెట్టుబడులను ప్రోత్సహించే విధానాలు కూడా ఉంటే శ్రేయస్కరంగా ఉంటుంది. పన్ను మినహాయింపుల్లాంటివి (ఈఎల్‌ఎస్‌ఎస్‌ స్కీముల తరహాలో) ఇస్తే, సగటు భారతీయుల పొదుపు మొత్తాలు, ఆదాయాన్నిచ్చే ఫిక్సిడ్‌ ఇన్‌కం పోర్ట్‌ఫోలియో నుంచి సంపదను సృష్టించే ప్యాసివ్‌ ఈక్విటీ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోలోకి మళ్లేందుకు తోడ్పడతాయి.   

వందన త్రివేది హెడ్‌ (ఇనిస్టిట్యూషనల్‌ బిజినెస్, ప్యాసివ్స్‌), యాక్సిస్‌ ఏఎంసీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement