బ్యాంకులు ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. చాలా మంది నిత్యం ఏదో ఒక పనిమీద బ్యాంకు శాఖలను సందర్శిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేస్తాయి.. ఏ రోజుల్లో సెలవులు ఉంటాయన్నది తెలుసుకోవడం ముఖ్యం. వీటిని ముందే తెలుసుకుంటే అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకునే అవకాశం ఉంటుంది.
అక్టోబర్ నెల అప్పుడే ముగింపునకు వచ్చేసింది. ఈ నెలలో పండుగలు, సెలవులు ముగిశాయి. నవంబర్ ప్రారంభం కాబోతోంది. ఇక వచ్చే నెలలో బ్యాంకు సెలవులు (Bank Holidays in November 2025) ఎప్పుడు ఉంటాయన్నదానిపై వినియోగదారులు దృష్టి సారించారు. నవంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు 9 నుండి 10 రోజుల పాటు మూసిఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన బ్యాంక్ సెలవుల జాబితాను ఇక్కడ పరిశీలిద్దాం..
ఈరోజుల్లోనే బ్యాంకు సెలవులు
నవంబర్ 1 - కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా కర్ణాటకలో, ఐగస్ బఘ్వాల్ సందర్భంగా డెహ్రాడూన్లో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 2 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు
నవంబర్ 5 - గురునానక్ జయంతి / కార్తీక పూర్ణిమ / రహస్ పూర్ణిమ సందర్భంగా ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోహిమా, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, రాయపూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్ లలో బ్యాంకులు మూసిఉంటాయి.
నవంబర్ 7 - వంగాలా ఫెస్టివల్ సందర్భంగా షిల్లాంగ్లో సెలవు
నవంబర్ 8 - రెండో శనివారం దేశవ్యాప్తంగా సెలవు
నవంబర్ 9 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు
నవంబర్ 16 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు
నవంబర్ 22 - నాలుగో శనివారం దేశవ్యాప్తంగా సెలవు
నవంబర్ 23 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు
నవంబర్ 30 - ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు
సెలవు రోజుల్లో భౌతికంగా బ్యాంకులు శాఖలు మూసిఉంచినప్పటికీ, వినియోగదారులు ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లు, యూపీఐ సేవలను అంతరాయం లేకుండా ఉపయోగించవచ్చు.


