గుడ్‌ న్యూస్‌ : 1000 ఇంజీనీర్‌ ఉద్యోగాలు

PayPal to hire 1000 engineers in 2021 for India development centres - Sakshi

2021లో 1000 ఉద్యోగాలు :పేపాల్‌

హైదరాబాద్‌,  బెంగళూరు, చెన్నై అవకాశాలు

సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ సొల్యూషన్స్‌ సేవల సంస్థ పేపాల్‌ ఇంజనీర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2021లోభారీగా ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు వెల్లడించింది. సాఫ్ట్‌వేర్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, రిస్క్ అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ స్ట్రీమ్స్ ఎంట్రీ, మిడ్-లెవల్ , సీనియర్ రోల్స్‌లో ఈ నియామకాలు జరుగుతాయి.హైదరాబాద్‌,  బెంగళూరు, చెన్నైలోని డెవలప్‌మెంట్‌ సెంటర్లలో దాదాపు వేయి మందిని కొత్తగా ఉద్యోగాల్లో చేర్చకోనున్నామని పేపాల్‌ తాజాప్రకటనలో తెలిపింది

కరోనా  మహమ్మారి కారణంగా డిజిటల్‌ చెల్లింపులకుడిమాండ్‌ పెరిగిందనీ, ఈ నేపథ్యంలో తమ కేంద్రాల కీలకంగా మారనుందని పేపాల్‌  తెలిపింది. పేపాల్‌కు ప్రస్తుతం భారతదేశంలోని మూడు కేంద్రాలలో 4,500 మందికి పైగా ఉద్యోగులున్నారు. అమెరికా తరువాత భారతదేశంలోని సాంకేతిక కేంద్రాలు అతిపెద్దవన్నారు. దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరన నేపథ్యంలో  వినియోగదారులు, వ్యాపారుల అవసరాలను తీర్చడంపై దృష్టిపెట్టామన్నారు. ఈ క్రమంలో  తాజా నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేపాల్ ఇండియా  ప్రతినిధి గురు భట్ అన్నారు.  

కాగా దేశీయంగా ఏప్రిల్‌ 1 నుంచి తమ సర్వీసులు నిలిపేయనున్నట్లు గత నెలలో పేపాల్‌ ప్రకటించింది. భారత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టనున్నాం. ఇకపై భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు , భారతీయ వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించేందుకు కృషి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top