మార్కెట్లో పెరిగిన ప్యాసింజర్‌ వెహికల్ సేల్స్ | Passenger Vehicles Sales Increased In India; Check Details | Sakshi
Sakshi News home page

మార్కెట్లో పెరిగిన ప్యాసింజర్‌ వెహికల్ సేల్స్

Sep 12 2023 7:35 AM | Updated on Sep 12 2023 11:40 AM

Passenger Vehicles Sales Increased Details - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్‌ వాహనాల హోల్‌సేల్‌ అమ్మకాలు ఆగస్ట్‌లో 3,59,228 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 9% వృద్ధి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) ప్రకారం.. తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన త్రిచక్ర వాహనాల సంఖ్య 2022 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో 38,369 నుంచి 64,763 యూనిట్లకు ఎగశాయి. 

టూ–వీలర్లు 15,57,429 నుంచి 15,66,594 యూనిట్లను తాకాయి. ప్యాసింజర్‌ వాహన విభాగంలో 16% వృద్ధితో మారుతీ సుజుకీ 1,56,114 యూనిట్ల విక్రయాలను సాధించింది. హుందాయ్‌ అమ్మకాలు 49,510 నుంచి 53,830 యూనిట్లకు చేరాయి. 

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఏడీఏ) ప్రకారం గత నెల రిటైల్‌లో ప్యాసింజర్‌ వెహికిల్స్‌ విక్రయాలు 7 శాతం దూసుకెళ్లి 3,15,153 యూనిట్లు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాల సేల్స్‌ 11,80,230 నుంచి 12,54,444 యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 66% ఎగసి 99,907 యూనిట్లుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement