ఓఎన్‌జీసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు | ONGC investing INR 1 lakh Cr to transform into low-carbon energy player | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

Aug 19 2023 4:50 AM | Updated on Aug 19 2023 4:50 AM

ONGC investing INR 1 lakh Cr to transform into low-carbon energy player - Sakshi

న్యూఢిల్లీ: తక్కువ కర్బన ఇంధన సంస్థగా అవతరించే లక్ష్యంతో ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ ఈ దశాబ్దం చివరికి రూ.లక్ష కోట్లను ఇన్వెస్ట్‌ చేయనుంది. పునరుత్పాదక ఇంధనాలు, గ్రీన్‌ హైడ్రోజన్‌ కంపెనీ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాయి. తక్కువ కర్బన ఇంధనాల పోర్ట్‌ఫోలియోను పెంచుకునే స్పష్టమైన కార్యాచరణతో ఉన్నట్టు ఓఎన్‌జీసీ తాజాగా ప్రకటించింది. ‘‘దేశ ప్రతిష్టాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఓఎన్‌జీసీ సైతం అడుగులు వేస్తుంది. బిలియన్‌ టన్నుల మేర కర్బన ఉద్గారాల విడుదలను కట్టడి చేయడం, 2030 నాటికి కర్బన తీవ్రతను 45 శాతానికి తగ్గించడం కోసం కృషి చేస్తాం’’అని ఓఎన్‌జీసీ తెలిపింది.

సుస్థిర విధానాలను అనుసరించడం వల్ల గడిచిన ఐదేళ్లలో స్కోప్‌–1, స్కోప్‌–2 ఉద్గారాల విడుదలను 17 శాతం తగ్గించినట్టు పేర్కొంది. 2022–23లోనే ఉద్గారాల విడుదలను 2.66 శాతం తగ్గించుకున్నట్టు వివరించింది. 2038 నాటికి స్కోప్‌–1, స్కోప్‌–2 ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురానున్నట్టు ప్రకటించింది. తక్కువ కర్బన ఇంధనాల కోసం ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నట్టు తెలిపింది. రెండు గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌2కెమికల్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. 2030 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 10 గిగావాట్లకు చేర్చనున్నట్టు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement