మార్కెట్ లీడర్‌గా వన్‌ప్లస్ 

OnePlus leads India premium smartphone market  - Sakshi

29.3 శాతం వాటాతో మార్కెట్ లీడర్‌గా  వన్‌ప్లస్ 

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో  టాప్ 

సాక్షి, న్యూఢిల్లీ:  భారతీయ  ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో  గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్ టాప్ లో నిలిచింది.  జూన్ త్రైమాసికంలో 29.3 శాతం మార్కెట్ వాటాతో ఇండియన్ మార్కెట్ లీడర్‌గా  నిలిచిందని తాజా నివేదిక తెలిపింది. (వన్‌ప్లస్‌ నార్డ్‌ వచ్చేసింది..ధర ఎంతంటే)

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం  వన్‌ప్లస్ 8  5 జీ మొబైల్ రెండవ త్రైమాసికంలో (క్యూ 2) ప్రీమియం విభాగంలో (30వేల రూపాయలు అంతకంటే ఎక్కువ) టాప్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా అవతరించింది. ఒక బ్రాండ్‌గా, తమ విశ్వాసం ఉంచిన  భారత సమాజానికి హృదయపూర్వక  కృతజ్ఞతలు తెలుపుతున్నామని వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ ప్రకటించారు. అసమానమైన నాణ్యతతో  పెద్దగా భారం లేని అనుభవాన్ని అందించే ఉత్పత్తులను రూపొందించే కృషి కొనసాగుతుందన్నారు. (భారత్‌లో వన్‌ప్లస్‌ 8, వన్‌ప్లస్‌ 8 ప్రో లాంఛ్‌)

కాగా ఏప్రిల్‌లో లాంచ్  చేసిన  వన్‌ప్లస్ 8 సిరీస్ 5 జీ  వన్‌ ప్లస్ 8 ప్రో  వన్‌ ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్లకు భారతీయ వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది. అల్ట్రా-ప్రీమియం విభాగంలో అత్యధికంగా అమ్ముడైన మొదటి మూడు స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌ప్లస్ 8 ప్రో ఒకటి. ('మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం: వన్‌ప్లస్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top