ఓలా కొత్త స్కూటర్ లాంచ్.. 320 కిమీ రేంజ్! | Ola S1 X Plus 5 2 kWh With 4680 Bharat Cells Launched At Rs 1 30 Lakh | Sakshi
Sakshi News home page

ఓలా కొత్త స్కూటర్ లాంచ్.. 320 కిమీ రేంజ్!

Apr 14 2026 3:12 AM | Updated on Apr 14 2026 3:19 AM

Ola S1 X Plus 5 2 kWh With 4680 Bharat Cells Launched At Rs 1 30 Lakh

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. స్వదేశీంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్‌తో పనిచేసే S1 X+ 5.2 kWhను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన కొత్త టూవీలర్ ప్రారంభ ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). అయితే ఈ ధర 2026 ఏప్రిల్ 15 తరువాత పెరగనుంది. 4680 భారత్ సెల్ ప్రత్యేకత ఏమిటంటే, ఓలా తన సొంత సెల్ టెక్నాలజీని సామాన్య ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తోంది.

తమ సొంత సెల్ టెక్నాలజీతో.. ఎక్కువ రేంజ్ అందించే ఈవీ స్కూటర్లను మార్కెట్‌కు అందుబాటులోకి తీసుకురావచ్చని సంస్థ చెబుతోంది. ఓలా ఎస్1 ఎక్స్+ ఇంటిగ్రేటెడ్ ఎంసీయూతో కూడిన 11 కిలోవాట్ల మిడ్-డ్రైవ్ మోటార్‌తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 125 కిలోమీటర్లు. ఇందులో బ్రేక్-బై-వైర్, ఫ్రంట్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. 5.2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ ఒకే ఛార్జ్‌పై 320 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement