
మసెరటి ఇండియా.. ఎంసీపూరా, ఎంసీపూరా సిలో కన్వర్టిబుల్ కార్లను లాంచ్ చేసింది. వీటి ధరలు వరుసగా రూ.4.12 కోట్లు, రూ.5.12 కోట్ల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. 2025 జులైలో గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో కనిపించిన ఈ కార్లు ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన 3 నెలల తర్వాత భారతదేశంలో లాంచ్ అయ్యాయి.
లేటెస్ట్ డిజైన్ కలిగిన ఈ కారు.. గ్రిల్, సీ పిల్లర్‌పై ట్రైడెంట్ లోగోలను పొందుతుంది. స్క్రిప్ట్, వీల్ సెంటర్ క్యాప్‌లపై కూడా ఎంసీపూరా బ్యాడ్జ్‌లు చూడవచ్చు. బటర్‌ఫ్లై వింగ్ డోర్లు, కార్బన్ ఫైబర్ మోనోకోక్ ఛాసిస్, కన్వర్టిబుల్ వెర్షన్ కోసం రిట్రాక్టబుల్ గ్లాస్ రూఫ్ వంటివి ఈ కారులో చూడవచ్చు.
ఇంజిన్ విషయానికి వస్తే.. మసెరటి ఎంసీ పూరా 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వీ6 ఇంజిన్ పొందుతుంది. ఇది 621 హార్స్ పవర్, 719 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారు కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 325 కిమీ/గం.