ఎల్ఐసీ పాలసీ దారులకు శుభవార్త.. ఉచితంగా క్రెడిట్ కార్డు!

LIC Policy Holders Get Free LIC Credit Card Sitting At Home - Sakshi

LIC Policy Holders: ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ తన పాలసీ దారులకు శుభవార్త అందించింది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ ఆఫ్ ఇండియా) తన కస్టమర్ లేదా పాలసీ హోల్డర్, ఏజెంట్లకు ఉచితంగా క్రెడిట్ కార్డును ఇవ్వనునట్లు తెలిపింది. ఐడీబీఐ బ్యాంక్ సహకారంతో ఎల్ఐసీ సీఎస్ఎల్ ఇటీవల రూపే క్రెడిట్ కార్డును ప్రారంభించింది. ఈ క్రెడిట్ కార్డును లుమైన్ కార్డు, ఎక్లాట్ కార్డుల పేరుతో తీసుకొచ్చింది. ఈ క్రెడిట్ కార్డులు ప్రస్తుతం ఎల్ఐసీ ఏజెంట్లు, సభ్యులు, పాలసీదారులకు ప్రత్యేకంగా ఇస్తుంది. త్వరలో ఈ కార్డులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని చూస్తుంది.

ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ కార్డు ద్వారా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించినట్లయితే రెట్టింపు రివార్డ్ పాయింట్లను అందుకుంటారు. అంతేకాక పెట్రోల్ బంకుల వద్ద ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు కూడా ఉంటుంది. ఈ కార్డుల పలు రకాల ఇతర ప్రయోజనాలను అందిస్తాయని ఎల్ఐసీ చెప్పింది. ఈ రెండు క్రెడిట్ కార్డులను ఎల్ఐసీ, ఐడిబిఐ బ్యాంక్ కలిసి సంయుక్తంగా అందిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమింటే ఈ కార్డులకు ఎలాంటి మెంబర్‌షిప్ ఫీజులు కానీ లేదా యాన్యువల్ ఫీజులు కానీ చెల్లించాల్సివసరం లేదు. ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ లింకు మీద క్లిక్ చేయండి.

ఇతర ప్రయోజనాలు:

  • లూమిన్ కార్డుపై రూ.100 ఖర్చు చేస్తే 3 డిలైట్ పాయింట్లను మీరు పొందవచ్చు.
  • ఎక్లాట్ క్రెడిట్ కార్డుపై రూ.100 ఖర్చు చేస్తే 4 డిలైట్ పాయింట్లు వస్తాయి.
  • ఎల్ఐసీ ఐడీబీఐ ఎక్లాట్ కార్డు హోల్డర్స్‌కు దేశీయ, అంతర్జాతీయ విమానశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సస్ కూడా లభిస్తుంది.
  • ఈ కార్డుల ద్వారా రూ.400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీ చేస్తే 1 శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ రియంబర్స్‌మెంట్ ఉంటుంది.
  • 3000 కంటే ఎక్కువ మొత్తంలో ఏదైనా కొంటే, వాటిని తేలికగా ఈఎంఐల్లోకి మార్చుకోవచ్చు.
  • ఈ క్రెడిట్ కార్డులకు కూడా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. రూ.5 లక్షల వరకు సమ్ అస్యూర్డ్ లభిస్తుంది.
  • మీ పేరుపై ఇప్పటికే ఒక కార్డు ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో మరిన్ని యాడ్-ఆన్ కార్డులను మీరు పొందవచ్చు.
  • లూమిన్ క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 50వేలు గాను, ఎక్లాట్ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.2 లక్షలుగా ఉంది.
  • ఈ కార్డుల యూనిక్ ఫీచర్ ఏమిటంటే ఎలాంటి ప్రాసెసింగ్ కాస్ట్ ఉండదు.
  • ఈ రెండు క్రెడిట్ కార్డుల వ్యాలిడిటీ 4 ఏళ్లుగా ఉంది.

(చదవండి: ఇస్మార్ట్‌ శంకర్‌ కాదు.. ఇస్మార్ట్‌ ఎలన్‌ మస్క్‌ !) 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top