ఒక్క షోరూమ్ లేకుండానే.. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయం ప్రారంభించిన దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాల్లో గణనీయమైన పురోగతిని సాధించింది. ఆ తరువాత షోరూమ్స్ ప్రారంభించింది. ఇప్పుడు విక్రయానంతర సేవలను సైతం మొదలుపెట్టింది.
ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను ఓపెన్ ప్లాట్‌ఫామ్‌గా మార్చింది. అంటే ఇప్పుడు విడిభాగాలు ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చన్నమాట. ఈ విషయాన్ని సీఈఓ భవిష్ అగర్వాల్ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు.
''ఈరోజు నుండి, ఓలా ఎలక్ట్రిక్ విడిభాగాలు మా యాప్ & వెబ్‌సైట్‌లో బహిరంగంగా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఓలా కస్టమర్ ఇప్పుడు విడిభాగాలను నేరుగా కొనుగోలు చేయవచ్చు. మీరు ఏ మెకానిక్ దగ్గర అయినా వీటిని ఫిట్ చేసుకోవచ్చు'' అని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రూ. 299తో 35జీబీ డేటా: ఉచితంగా జియోఫై డివైజ్
భవిష్ అగర్వాల్ ట్వీట్‌పై 'కునాల్ కమ్రా' స్పందించారు. ''మీరు ప్రజలను.. విడిభాగాలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి, ఏదైనా మెకానిక్ వద్దకు వెళ్లమని చెబుతున్నారా. సంవత్సరాలుగా కస్టమర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఇప్పుడు పరిష్కారం వచ్చింది. ఈ సందర్బంగా.. ఒక క్షమాపణ లేదు, అసౌకర్యానికి క్షమించండి అని కూడా చెప్పలేదు. ఇలాంటివి కేవలం భారతదేశంలో మాత్రమే జరుగుతుంది'' అని అన్నారు.
Are you asking people to buy your parts online then go to any mechanic they can find… This solution after years of pain/suffering customers have faced.
No apology, Not even a “Sorry for the inconvenience” They could have done this years ago…
“This happens only in India”… https://t.co/eoaolhOX1x— Kunal Kamra (@kunalkamra88) October 27, 2025


