
ప్రముఖ ప్రీమియం బైక్‌ల తయారీ సంస్థ కేటీఎం ఇండియన్ మార్కెట్లో విక్రయించే తమ ద్విచక్ర వాహనాల ధరలను సవరించింది. ఈ మార్పులతో వివిధ బైక్‌ల ధర రూ.12,000 వరకు పెరిగింది. ఆయా మోడళ్లపై కనీసం రూ.1,000 మేర ధరలను కంపెనీ పెంచేసింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులతోపాటు ద్రవ్యోల్బణ వ్యత్యాసానికి అనుగుణంగా సర్దుబాటు చేయడంలో భాగంగా ఇతర కంపెనీలతోపాటు కేటీఎం కూడా తమ బైక్‌ల ధరలను పెంచింది.
ఏ బైక్‌పై ఎంత పెరిగింది?
🔺కేటీఎం 390 డ్యూక్‌పై అత్యల్పంగా రూ .1,000 పెరిగింది. దీంతో ఈ బైక్ ధర రూ.2.96 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరింది. అయితే ఇంతకుముందు ఈ బైక్ ధరను రూ.18,000 తగ్గించింది. దాంతో అప్పుడు ఈ ద్విచక్ర వాహనం ధర రూ.3.13 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు (ఎక్స్ షోరూమ్) తగ్గింది.
🔺 ఇక కేటీఎం 250 డ్యూక్, ఆర్‌సీ 390 మోడళ్ల ధరలు రూ .5,000 కంటే ఎక్కువ పెరిగాయి. దీంతో 250 డ్యూక్ ధర రూ.2.30 లక్షలకు చేరగా, ఆర్‌సీ 390 ధర రూ.3.23 లక్షలకు (రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు) చేరింది. ఇండియన్ మార్కెట్లో బజాజ్ పల్సర్ ఎన్ 250, హీరో ఎక్స్ ట్రీమ్ 250ఆర్, సుజుకి జిక్సర్ 250 వంటి ప్రసిద్ధ మోడళ్లలో కేటీఎం 250 డ్యూక్ కూడా ఒకటి.
🔺కేటీఎం ఆర్‌సీ 200 బైక్ ధర అత్యధికంగా రూ .12,000 పెరిగింది. ఈ మార్పుతో, ఈ బైక్ ప్రారంభ ధర రూ .2.21 లక్షల నుండి రూ .2.33 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఈ బైక్ హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్, బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200, సుజుకి ఎస్ఎఫ్ 250, యమహా ఆర్ 15 వీ4 వంటి మోడళ్లకు పోటీగా ఉంది.