
అసలైన మెసేజ్‌లు, స్పామ్ మెసేజ్‌లను మొబైల్ యూజర్లు సులువుగా గుర్తించేందుకు వీలుగా టెలికం సంస్థలు ప్రత్యేక విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. దీని ప్రకారం మెసేజ్‌ల వర్గీకరణ బట్టి వాటిని పంపించే వారి పేరు లేదా హెడర్‌కి ముందు నిర్దిష్ట ‘కోడ్’ వస్తుంది. ప్రమోషనల్ ఎస్‌ఎంఎస్‌లకు ‘పి’ (ఆంగ్ల అక్షరం), సర్వీస్ సంబంధితమైనవాటికి ‘ఎస్’, లావాదేవీలకు సంబంధించిన వాటికి ‘టి’, ప్రభుత్వం నుంచి వచ్చే మెసేజీలకు ‘జి’ అని కనిపిస్తుంది.
ఇదీ చదవండి: ఎగుమతులు కదల్లేదు..మెదల్లేదు!
ఈ కోడ్‌లతో ఏ ఎస్‌ఎంఎస్ ఏ కోవకి చెందినదో సులువుగా తెలుసుకునేందుకు వీలవుతుందని, అవాంఛిత మెసేజ్‌లకు దూరంగా ఉండొచ్చని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్‌పీ కొచర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఓటీటీ యాప్‌లపై నియంత్రణ లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఈ నేపథ్యంలో ఓటీటీ యాప్‌లను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తే వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వీలవుతుందని కొచర్ పేర్కొన్నారు.