జియో ఐపీవో ఎప్పుడంటే? | Jio IPO Details | Sakshi
Sakshi News home page

జియో ఐపీవో ఎప్పుడంటే?

Mar 27 2026 2:49 PM | Updated on Mar 27 2026 3:08 PM

Jio IPO Details

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌లోని టెలికం నిర్వాహక హోల్డింగ్‌ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా కొత్త ఏడాదిలో ఐపీవో బాట పట్టిన తొలి కంపెనీగా నిలిచే వీలుంది.

దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ చైర్మన్‌గా 2016లో టెలికం కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ.. ఆయన తనయుడు ఆకాశ్‌ అంబానీ నాయకత్వంలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. 125 బిలియన్‌ డాలర్ల విలువను ఆశిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ఐపీవోలో 2.5 శాతం వాటా విక్రయించే వీలుంది.

దీంతో ఐపీవో పరిమాణం 3 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 28,000 కోట్లు)గా సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెరసి అతిపెద్ద ఐపీవోగా నిలిచే వీలుంది. ఇంతక్రితం 2022 మే నెలలో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ 2.5 బిలియన్‌ డాలర్ల ఐపీవో చేపట్టింది. ఇది రికార్డుకాగా.. తదుపరి 2024 అక్టోబర్‌లో ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్‌ 2.97 బిలియన్‌ డాలర్ల సమీకరణతో స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యింది. తద్వారా రికార్డును సవరించింది.

Advertisement
 
Advertisement
Advertisement