జావా 42 బాబర్ కొత్త వేరియంట్.. ధర ఎంతో తెలుసా? | Sakshi
Sakshi News home page

జావా 42 బాబర్ కొత్త వేరియంట్.. ధర ఎంతో తెలుసా?

Published Sun, May 26 2024 4:03 PM

Jawa 42 Bobber Red Sheen Variant Launched; Price And Details

జావా మోటార్‌సైకిల్స్ తన '42 బాబర్' బైకును కొత్త 'రెడ్ షీన్' వేరియంట్‌లో లాంచ్ చేసింది. ఇది కొత్త పెయింట్ స్కీమ్ పొందటమే కాకుండా.. కొత్త అల్లాయ్ వీల్స్, కొన్ని కాస్మెటిక్ ట్వీక్‌లను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 2.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). స్టాండర్డ్ వేరియంట్ కంటే దీని ధర రూ. 9550 ఎక్కువ.

కొత్త కలర్ జావా 42 బాబర్.. రెడ్ షీన్ ట్రిమ్ ట్యూబ్‌లెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో పాటు రెడ్ అండ్ క్రోమ్‌లలో పూర్తి చేసిన సరికొత్త డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌ను పొందుతుంది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కొంత ఆకర్షణీయంగా ఉంటుంది.

జావా 42 బాబర్ కొత్త వేరియంట్‌లో కాస్మొటిక్ అప్డేట్స్ కాకుండా.. ఇంజిన్, పర్ఫామెన్స్ వంటి వాటిలో ఎటువంటి అప్డేట్స్ లేదు. కాబట్టి ఇందులో అదే 334 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 29.5 Bhp పవర్ మరియు 30 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement