
పరిశ్రమలకు వాణిజ్య మంత్రి గోయల్ సూచన
డిమాండ్‌కు ఊతం లభిస్తుందన్న ఆశాభావం
జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని పరిశ్రమ తప్పకుండా వినియోగదారులకు అందించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. స్వాతంత్య్రం తర్వాత చేపట్టిన అతిపెద్ద, విప్లవాత్మక సంస్కరణగా దీన్ని అభివరి్ణస్తూ, ప్రధాని మోదీకి ఈ ఘనతను ఆపాదించారు. అన్ని రంగాల్లోనూ డిమాండ్‌కు ఊతమిస్తుందన్నారు. భారత్‌లో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించాలని పరిశ్రమను కోరారు.
ఫార్మా, హెల్త్‌కేర్‌కు సంబంధించి 11 అంతర్జాతీయ ప్రదర్శన (ఇండియా మెడ్‌టెక్ ఎక్స్‌పో 2025, ఐఫెక్స్ 2025)ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. జీఎస్‌టీలో తీసుకొచి్చన సంస్కరణలు రైతుల నుంచి ఎంఎస్‌ఎంఈల వరకు.. ఫార్మా రంగంతోపాటు మరెన్నో రంగాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకరిస్తుందన్నారు. వచ్చే రెండేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందంటూ.. 4 ట్రిలియన్ డాలర్ల పరిమాణం నుంచి 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి బలపడుతుందని చెప్పారు.
పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఊతం..
‘జీఎస్‌టీ తగ్గింపు మొత్తాన్ని వినియోగదారులకు బదలాయించినప్పుడే పరిశ్రమకు పూర్తిస్థాయిలో ప్రయోజనం దక్కుతుంది. రేట్లు తగ్గడం సహజంగానే వినియోగాన్ని పెంచుతుంది. డిమాండ్‌కు ఊతంతో పెద్ద ఎత్తున పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు, వృద్ధికి దారితీస్తుంది’ అని మంత్రి చెప్పారు.
సాఫీగా మారేలా చూస్తాం: సీబీఐసీ చైర్మన్
జీఎస్‌టీలో ప్రతిపాదిత కొత్త శ్లాబులకు సాఫీగా మారేందుకు వీలుగా, సెపె్టంబర్ 22 నాటికి టెక్నాలజీని సిద్ధం చేస్తామని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. రిటర్నుల దాఖలుకు వీలుగా సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ విషయమై పరిశ్రమతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.