అమెరికాలో ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’..అమెరికాలో ఎన్నారై విభాగం టీడీపీ నేతలకు 25 ఏళ్ల జైలు శిక్ష!

Indian-American IT Sivannarayana Barama Convicted Of Making Illicit Profits Worth USD 7.3 Million - Sakshi

అమెరికా టీడీపీ ఎన్నారై విభాగంలో కీలక సభ్యులుగా వ్యవహరిస్తున్న నెల్లూరు జనార్ధన్ చౌదరి, బర్మా శివ నారాయణ చౌదరిలు జైలు శిక్ష అనుభవించనున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పాల్పడినట్లు తేలడంతో అమెరికా న్యాయ స్థానం సుమారు 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో తుది తీర్పు వెలువరించనుంది. 
 

 నెల్లూరు జనార్ధన్ చౌదరి, బర్మా శివ నారాయణ చౌదరిలు అమెరికాలో ఐటీ ప్రొఫెషనల్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఓవైపు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే అమెరికా టీడీపీ ఎన్నారై విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే వారిద్దరు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడడంతో  కాలిఫోర్నియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అమెరికన్‌ స్టాక్‌ ఎక్చ్ంజ్‌లో నమోదైన ఓ పబ్లిక్‌ ట్రెడెడ్‌ కంపెనీ నిర్వహించే ట్రేడింగ్‌లో..  ఆ కంపెనీ స్టాక్స్‌తో పాటు ఇతర ఆర్ధిక సంబంధిత రహస్య సమాచారాన్ని నాలుగు సార్లు ఇతరులకు చేరవేయడం ద్వారా నిందితులు లాభపడేలా సెక్యూరిటీ ఫ్రాడ్‌కు పాల్పడినట్లు తేలింది. 

శివ నారాయణ బర్మాతో పాటు అతని సహచరుడు  నెల్లూరు జనార్ధన్ కుట్రపూరితంగా  సెక్యూరిటీ మోసానికి పాల్పడ్డారంటూ 2019లో అమెరికన్‌ పోలీసులు అభియోగాలు మోపారు. కేసు విచారణ కొనసాగుతుండగా సత్యనారాయణ సహచరుడు తాము నేరం చేసినట్లు అంగీకరించాడు. దీనిపై జ్యూరీ ట్రయల్స్‌ (కోర‍్టు ధర్మాసనం) విచారణ జరిపి గతేడాది డిసెంబర్‌ 13న తీర్పు వెలువరించారు.  

పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌
జ్యూరీ ట్రయల్స్‌లో నిందితుడు శివ నారాయణ అమెరికా టెక్నాలజీ ఎక్స్ఛేంజ్ 'నాస్‌డాక్'లో లిస్టైన పాలో ఆల్టో నెట్‌వర్క్‌ క్వార్టర్లీ ఫైనాన్షియల్‌ పర్ఫార్మెన్స్‌ గురించిన సమాచారాన్ని షేర్‌ చేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారించారు.   

సమాచారాన్ని షేర్‌ చేయకూడదు
స్టాక్‌ ఎక్ఛేంజీలలో లిస్టెడ్‌ కంపెనీలు తమ పనితీరు, లాభనష్టాల గురించి ప్రతి మూడు నెలలకు (క్యూ1, క్యూ2, క్యూ3, క్యూ4) ఒకసారి బహిరంగంగా ప్రకటిస్తుంటాయి. ఆ మూడు నెలల లోపల కంపెనీ పనితీరు గురించి ఎవరికి షేర్‌ చేయరు. అలా చేయడం వల్ల స్టాక్‌ మార్కెట్‌లో ఆసంస్థ పనితీరుపై ప్రభావం చూపుతుంది. స్టాక్‌ వ్యాల్యూపెరగడం,తగ్గడంలాంటి ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. అందుకే 3 నెలలు ముగిసిన తర్వాతనే కంపెనీల పనితీరును అనౌన్స్‌ చేస్తాయి. ఆ సమాచారాన్ని సత్యనారాయణ పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌ పనితీరు గురించి ముందే లీక్‌ చేశారు.

అన్నం పెట్టిన ఇంటికే సున్నం 
రహస్యంగా ఉండే కంపెనీల సమాచారాన్ని శివ నారాయణ ముందే ఎలా చేరవేశారనే అనుమానంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. ఆ విచారణలో నిందితుడు పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌ మాజీ కాంట్రాక్టర్‌గా పనిచేసినట్లు తేలింది. కాంట్రాక్టర్‌గా పనిచేసే సమయంలో ఆ సంస్థ ఐటీ విభాగంలో పనిచేసే ఉద్యోగుల్ని కలిసినట్లు, వారి ద్వారా కంపెనీ ఆర్ధిక పరమైన రహస్యాలు సేకరించినట్లు నార్తన్‌ డిస్ట్రీక్‌ కాలిఫోర్నియా న్యాయవాది స్టెఫానీ ఎమ్ హిండ్స్ కార్యాలయం తెలిపింది

ఏడాది కాలంగా
శివ నారాయణ బర్మా ఓ వైపు ఉద్యోగిగా పనిచేస్తూనే.. మరోవైపు పాలో ఆల్టో నెట్‌వర్క్‌ 4 సార్ల త్రైమాసిక ఆదాయ ఫలితాల సమాచారంతో అక్టోబర్‌ 2016 నుంచి సెప్టెంబర్‌ 2017 వరకు ఇన్‌ సైడ్‌ ట్రేడింగ్‌ నిర్వహించారు. సంస్థకు చెందిన రహస్య సమాచారంతో పాటు, ట్రేడింగ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ గురించి.. ఆ కంపెనీ షేర్లు కొన్న ఇన్వెస్టర్లకు చేరవేశారు. దీంతో మదుపర్లు 5 రెట్లు లాభపడ్డారు.  

7.3 మిలియన్ల లాభం
అదే సమయంలో శివ నారాయణ సైతం నాలుగు సార్లు 7.3 మిలియన్లు, అంతకంటే ఎక్కువ అర్జించారు. ఇక జ్యూరీ సభ్యులు విచారణలో 18 యూఎస్‌ఈ సెక్షన్లు 1348ని ఉల్లంఘించి నాలుగు సెక్యూరిటీల మోసాలకు పాల్పడ్డారని, జ్యూరీ గత వారం బరామాను దోషిగా నిర్ధారించింది.

25ఏళ్లు జైలు శిక్ష
విచారణలో ప్రధాన యూఎస్‌ కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి రిచర్డ్ సీబోర్గ్  బరామకు శిక్షా విచారణ తేదీని ఖరారు చేయలేదు. ఒకవేళ అతనికి 25ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు  18 యూఎస్‌ఈ సెక్షన్లు 1348ని ఉల్లంఘన నియమావళిలో ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top