
భారత్‌లో ఊబకాయం పెరుగుతున్న నేపథ్యంలో ఇందుకోసం చేసే ఆర్థిక ఖర్చులు అధికమవుతున్నట్లు యునిసెఫ్ చైల్డ్ న్యూట్రిషన్ గ్లోబల్ రిపోర్ట్ 2025 తెలిపింది. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో పెరుగుతున్న ఊబకాయం సంక్షోభాన్ని హైలైట్ చేసిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలను కోరారు. శరీరంలో పెరుగుతున్న కొవ్వులపై ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. దాన్ని తగ్గించుకునేందుకు నెలవారీ ఖర్చులను కూడా ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు.
యునిసెఫ్ చైల్డ్ న్యూట్రిషన్ గ్లోబల్ రిపోర్ట్ 2025 ప్రకారం.. పాఠశాలకు వెళ్లే, కౌమారదశలోని పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ బరువు సమస్యను భారత్ క్రమంగా అధిగమిస్తున్నప్పటికీ, ఊబకాయం సమస్యగా పరణిమిస్తుంది. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ అంచనా ప్రకారం.. 2019లో ఊబకాయం సంబంధిత ఖర్చులు దాదాపు 29 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది భారతదేశ జీడీపీలో 1 శాతం. ఒబెసిటీ సమస్యకు అత్యవసర చర్యలు తీసుకోకపోతే 2060 నాటికి ఈ సంఖ్య 839 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది జీడీపీలో 2.5 శాతంగా ఉండనుంది.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్) డేటా ప్రకారం అధిక బరువు, ఊబకాయం ఉన్న ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2005-06లో ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 3 నుంచి 2019-21లో ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ 5 మధ్య వీరి సంఖ్య 127 శాతం పెరిగింది. కౌమారదశలో ఉన్న బాలికలు, బాలురు వరుసగా 125 శాతం, 288 శాతం అధికమయ్యారు.
లఖ్‌నవూ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మనోజ్ కుమార్ అగర్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నడక, శారీరక వ్యాయామం లేకపోవడం ఊబకాయం పెరగడానికి కారణాలుగా పేర్కొన్నారు. ‘ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా మొదలైన వాటిని అవలంబించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు’ అని అన్నారు.
ఊబకాయం పెరుగుదలకు కారణాలు..


