రోజురోజుకి వాయుకాలుష్యం పెరిగిపోతోంది, ఇతర ప్రమాదకర వాయువులు ఎక్కువకావడంతో.. ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, పలు కంపెనీలు పరిష్కార మార్గాలను అన్వేషించడంలో బిజీ అయ్యాయి. అయితే తొలిసారి మష్రూమ్ వరల్డ్ గ్రూప్ 'ఆల్గే ట్రీ' (Algae Tree) ఆవిష్కరించింది.
మష్రూమ్ వరల్డ్ గ్రూప్ 'ఆల్గే ట్రీ'ను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని స్వామి వివేకానంద పార్కులో ఏర్పాటు చేసింది. ఇది వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్‌ను గ్రహించి, దానిని ఆక్సిజన్‌గా మారుస్తుంది. ఈ ప్రక్రియ సాధారణ మొక్కలు జరిపే' కిరణజన్య సంయోగక్రియ' మాదిరిగా అన్నమాట. అయితే.. తక్కువ స్థలంలో ఎక్కువ కార్బన్‌ను ఆక్సిజన్‌గా మార్చడం దీని ప్రత్యేకత.
ఒక ఆల్గే ట్రీ సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కార్బన్ డైఆక్సైడ్‌ను గ్రహిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది దాదాపు 25 పెద్ద చెట్లు గ్రహించే CO₂కు సమానం. నగరాల్లో పెద్ద ఎత్తున చెట్లు నాటడానికి స్థలం లేకపోవడం వల్ల, ఈ విధమైన సాంకేతిక పరిష్కారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
India's first Algae Tree that converts carbon dioxide into oxygen, equal to 25 trees.
It also has solar panels on top and is installed in Bhopal's Swami Vivekananda Park.
Credit: Team Update Bus Bhopal, ViaWeb pic.twitter.com/4nBbP5B7qg— Pareekh Jain (@pareekhjain) May 10, 2026
ఆల్గే ట్రీ సోలార్ ప్లేట్లను పెపొందుతుంది. కాబట్టి ఇది సౌరశక్తితో పనిచేస్తుంది. అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా పునరుత్పాదక శక్తిని వినియోగించడం ద్వారా మరింత అనుకూలంగా ఉంటుందన్నమాట. దీనిని రూపొందించడానికి రెండు సంవత్సరాల సమయం పట్టిందని, 50 మందికి పైగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, నిపుణులు కలిసి పనిచేశారని సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం భారతదేశంలోని అనేక నగరాలు అధిక ఉష్ణోగ్రతలు, గాలి కాలుష్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆల్గే ట్రీ వంటి సాంకేతిక పరిజ్ఞానం నగరాల్లో కార్బన్ స్థాయిలను తగ్గించడంలో, గాలి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది!


