
లింక్డిన్ దేశీ మేనేజర్ పట్టాభిరామన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భవిష్యత్ ఉద్యోగ ప్రపంచానికి భారత్ ఒక సూచిక(సైన్‌పోస్ట్)లా నిలవనున్నట్లు గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సొంత ప్లాట్‌ఫామ్ లింకిడిన్ దేశీ మేనేజర్ కుమరేష్ పట్టాభిరామన్ పేర్కొన్నారు. సంస్థకు వేగంగా వృద్ధి చెందుతున్న, రెండో పెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించినట్లు వెల్లడించారు. 16 కోట్లకుపైగా యూజర్లున్నట్లు తెలియజేశారు.
ప్రస్తుత వృద్ధి రేటురీత్యా రెండు, మూడేళ్లలో అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఆవిర్భవించనున్నట్లు అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఫస్ట్ యువతతోపాటు.. నైపుణ్యాలు, లక్ష్యాలుగల వర్క్‌ఫోర్స్ దేశీ మార్కెట్‌కు జోష్‌నిస్తున్నట్లు పేర్కొన్నారు. లింకిడిన్ సభ్యుల సంఖ్య గత రెండేళ్లలో 50 శాతానికిపైగా జంప్‌చేసినట్లు వెల్లడించారు. 2020 నుంచి ఆదాయం సైతం రెట్టింపునకుపైగా ఎగసినట్లు తెలియజేశారు. దేశీయంగా 16 కోట్లకుపైగా ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టరైనట్లు పేర్కొన్నారు.