How Easy Ways To Fix The Issue When Gmail Storage Full - Sakshi
Sakshi News home page

Gmail Storage: మీ ఇ-మెయిల్ బాక్స్ నిండిపోయిందా, సింగిల్‌ క్లిక్‌తో ఇలా చేయండి!

Jul 29 2022 3:05 PM | Updated on Jul 29 2022 3:37 PM

How Easy Ways To Fix The Issue When Gmail Storage Full - Sakshi

బొత్తిగా అక్కర్లేని ఇ–మెయిల్స్‌ వస్తూనే ఉంటాయి. వాటి మానాన అవి పడి ఉంటాయిలే...అనుకోవడానికి లేదు. ఫ్రీ స్టోరేజ్‌ స్పేస్‌ నిండిపోతే సమస్య! ఈ నేపథ్యంలో వాటిని డిలీట్‌ చేయాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. మాన్యువల్‌గా పాత ఇ–మెయిల్స్‌ను వన్‌–బై వన్‌ సెలెక్ట్‌ చేసుకొని, డిలీట్‌ చేయడం కష్టం అనిపిస్తుంది. 

ఇలాంటి సందర్భంలో ఒకే టైమ్‌లో ఎక్కువ మొత్తంలో ఇ–మెయిల్స్‌ను డిలీట్‌ చేయడానికి ఒక ఫిల్టర్‌ను సెట్‌ చేసుకోవాలి. సెర్చ్‌బార్‌లో ఇ–మెయిల్‌ అడ్రస్‌ ఎంటర్‌ చేశాక ‘ఆల్‌’ ట్యాబ్‌ను సెలెక్ట్‌ చేసుకొని ‘డిలీట్‌’ ఐకాన్‌ను నొక్కాలి. ఇక లార్జ్‌ ఇ –మెయిల్స్‌ డిలీట్‌ చేయడానికి...

జీమెయిల్‌ ఓపెన్‌ చేసి ‘ఎటాచ్‌మెంట్‌ లార్జర్‌: 10ఎమ్‌’ అని టైప్‌ చేయాలి.

లార్జ్‌ ఇ– మెయిల్‌ ‘మెయిల్‌ బాక్స్‌’లో కనిపిస్తాయి.

వీటిని సెలెక్ట్‌ చేసుకొని, ముఖ్యమైనవి, డిలీట్‌ వద్దనుకుంటున్నవి  ‘అన్‌మార్క్‌’ చేయాలి

డిలీట్‌ బటన్‌ నొక్కాలి.

‘ఎంప్టీ ట్రాష్‌’ బటన్‌ నొక్కాలి.

Advertisement
 
Advertisement
Advertisement