కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. అదిరిపోయే ఆఫర్స్ వచ్చేశాయ్!

Honda Hyundai And Maruti Suzuki Festival Offers - Sakshi

భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. ఇక రానున్నది విజయ దశమి. ఈ సందర్భంగా చాలామంది వాహన కొనుగోలుదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు వాహన తయారీ సంస్థలు అద్భుతమైన డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం డిస్కౌంట్స్ అందిస్తున్న కార్ల కంపెనీల జాబితాలో మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా వంటివి ఉన్నాయి.

హోండా కంపెనీకి చెందిన సిటీ, అమేజ్ వంటి కార్ల మీద డిస్కౌంట్స్ అందిస్తోంది. హోండా సిటీ కారు మీద రూ. 75,000 వరకు ప్రయోజనాలు, అమేజ్ మీద రూ. 57,000 బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

హ్యుందాయ్ కంపెనీ విషయానికి వస్తే, ఇప్పుడు సంస్థ ఐ10 ఎన్ లైన్ మీద రూ. 50000, గ్రాండ్ ఐ నియోస్ మీద రూ. 43000, ఆరా మీద రూ. 33000, వెర్నా అండ్ అల్కజార్ మీద వరుసగా రూ. 25000 & రూ. 20000 ప్రయోజనాలను అందిస్తోంది.

ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా?

మారుతి సుజుకి కూడా ప్రీ-నవరాత్రి బుకింగ్ స్కీమ్ కింద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో మారుతి ఇగ్నీస్, బాలెనొ అండ్ సియాజ్ ఉన్నాయి. వీటి మీద కంపెనీ వరుసగా రూ. 65000, రూ. 55000 & రూ. 53000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ బెనిఫిట్స్ కేవలం ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

Note: హ్యుందాయ్, మారుతి సుజుకి, హోండా కంపెనీలు అందిస్తున్న ఈ ఆఫర్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని సంస్థ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top