జూన్‌ నుంచి గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి

Hallmarking of Gold Jewellery Mandate From June 1 - Sakshi

కేంద్రం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలు, కళాఖండాలపై 2021 జూన్‌ 1 నుంచీ హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి అని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. విలువైన మెటల్‌కు సంబంధించి ప్యూరిటీ సర్టిఫికేషన్‌ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరితో ఉందని వెర్చువల్‌గా జరిగిన ఒక విలేకరుల సమావేశంలో వినియోగ వ్యవహారాల కార్యదర్శి లీనా నందన్‌ పేర్కొన్నారు.  

2019 నవంబర్‌లో కేంద్రం చేసిన ప్రకటన ప్రకారం, పసిడి ఆభరణాలు, కళాఖండాలపై 2021 జనవరి 15 నుంచీ హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి. హాల్‌మార్కింగ్‌ విధానంలోకి మారడానికి, ఇందుకు సంబంధించి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండెర్డ్స్‌ (బీఐఎస్‌)తో తమకుతాము రిజిస్ట్రర్‌ కావడానికి ఆభరణాల వర్తకులకు ఏడాదికి పైగా సమయం ఇచ్చింది. అయితే కోవిడ్‌–19 నేపథ్యంలో హాల్‌మార్కింగ్‌ విధానం అమలుకు వర్తకులు చేసిన విజ్ఞప్తి చేశారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top