మిల్లెట్ల పిండిపై 5% పన్ను | Sakshi
Sakshi News home page

మిల్లెట్ల పిండిపై 5% పన్ను

Published Sun, Oct 8 2023 4:32 AM

GST Council Meet: GST Council decides to levy 5 percent tax on millet-based flour - Sakshi

న్యూఢిల్లీ: త్రుణ ధాన్యాల ఆధారిత పిండిపై 5 శాతం పన్ను విధించాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. లూజుగా విక్రయించే కనీసం 70 శాతం త్రుణధాన్యాల పిండిపై ఎలాంటి పన్ను ఉండదని ఆమె తెలిపారు. అదే ప్యాకేజీ రూపంలో లేబుల్‌తో విక్రయించే పిండిపై మాత్రం 5 శాతం పన్ను ఉంటుందని వివరించారు.

జీఎస్‌టీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (జీఎస్‌టీఏటీ)ప్రెసిడెంట్‌కు 70 ఏళ్లు, సభ్యులకైతే 67 ఏళ్ల గరిష్ట వయో పరిమితి విధించాలని కూడా 52వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం నిర్ణయించిందన్నారు. గతంలో ఇది వరుసగా 67, 65 ఏళ్లుగా ఉండేదన్నారు. మొలాసెస్‌పై ప్రస్తుతమున్న 28 శాతం జీఎస్‌టీని, 5 శాతానికి తగ్గించడంతోపాటు మానవ అవసరాల కోసం వినియోగించే డిస్టిల్డ్‌ ఆల్కహాల్‌కు జీఎస్‌టీ నుంచి మినహాయింపు కల్పించినట్లు మంత్రి చెప్పారు. ఒక కంపెనీ తన అనుబంధ కంపెనీకి కార్పొరేట్‌ గ్యారెంటీ ఇచ్చినప్పుడు, ఆ విలువను కార్పొరేట్‌ గ్యారెంటీలో 1 శాతంగా పరిగణిస్తారు. దీనిపై జీఎస్‌టీ 18 శాతం విధించాలని కూడా కౌన్సిల్‌ నిర్ణయించిందన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement