ఈ 26 యాప్స్‌పై గూగుల్ నిషేధం..ఇవి చాలా డేంజర్!

Google Banned These 26 Android Apps, Boot Them off Your Phone Now - Sakshi

రోజురోజుకి టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తుందో. అంత కంటే వేగంగా సైబర్ క్రైమ్ సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా వినియోగదారుల నుంచి డబ్బును దొంగిలించే 26 ఆండ్రాయిడ్ యాప్స్ ను గూగుల్ నిషేధించినట్లు తెలిపింది. హ్యాకర్లు కంప్యూటర్లలోకి చాలా సులభంగా ప్రవేశిస్తున్నారు. జింపెరియం జెడ్ లాబ్స్ భద్రత సంస్థ ఈ హానికరమైన యాప్స్ కనుగొనే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ప్రముఖ సెక్యూరిటీ కంపెనీ జింపెరియం గూగుల్ సంస్థకు ఈ హానికర యాప్స్ గురుంచి పిర్యాదు చేసిన తర్వాత వాటిని గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది.

గూగుల్ నిషేధించిన టాప్ 10 ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటి అంటే.. హ్యాండీ ట్రాన్స్ లేటర్ ప్రో, హార్ట్ రేట్, పల్స్ ట్రాకర్, జియోస్పాట్, జీపీఎస్ లొకేషన్ ట్రాకర్, ఐకేర్ - ఫైండ్ లొకేషన్, మై చాట్ ట్రాన్స్ లేటర్, బస్ - మెట్రోలిస్ 2021, ఫ్రీ ట్రాన్స్ లేటర్ ఫోటో, లాకర్ టూల్, ఫింగర్ ప్రింట్ ఛేంజర్, కాల్ రీకోడర్ ప్రో వంటివి ఉన్నాయి. కానీ, దుర దృష్టవశాత్తు ఈ హానికర ఆండ్రాయిడ్ యాప్స్ గురుంచి వాటిని వాడుతున్న చాలా మందికి తెలియదు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మొబైల్ ఫోన్ వినియోగదారులకు గూగుల్ హెచ్చరిక జారీ చేస్తుంది.(చదవండి: సరికొత్త మోసం.. ఈ లింక్ అస్సలు క్లిక్ చేయకండి!)

వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్లో తనిఖీ చేయకుండానే డౌన్లోడ్ చేసుకోవడానికి కారణం మిలియన్ల మంది వాటిని డౌన్ లోడ్ చేసుకోవడమే. టాప్ ఇన్ క్రామ్టెడ్ అనే ఆండ్రాయిడ్ యాప్ 5,00,000 నుంచి 10,00,000 సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ జాబితాలో ఉన్న యాప్స్ ను కనీసం 5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అందుకే మీ మొబైల్ లో గనుక ఈ క్రింద పేర్కొన్న యాప్స్ ఉంటే వెంటనే తొలగించాలని నిపుణులు సూచిస్తున్నారు. జింపెరియం జెడ్ లాబ్స్(Zimperium zLabs) సెక్యూరిటీ రీసెర్చర్లు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లను గ్రిఫ్ట్‌ హార్స్‌ లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తించారు. 

హానికరమైన 26 యాప్స్:

 • Handy Translator Pro 
 • Heart Rate and Pulse Tracker     
 • Geospot: GPS Location Tracker     
 • iCare – Find Location 
 • My Chat Translator 
 • Bus – Metrolis 2021 
 • Free Translator Photo 
 • Locker Tool 
 • Fingerprint Changer 
 • Call Recoder Pro 
 • Instant Speech Translation 
 • Racers Car Driver 
 • Slime Simulator 
 • Keyboard Themes 
 • What’s Me Sticker 
 • Amazing Video Editor 
 • Safe Lock 
 • Heart Rhythm     
 • Smart Spot Locator     
 • CutCut Pro 
 • OFFRoaders – Survive 
 • Phone Finder by Clapping 
 • Bus Driving Simulator 
 • Fingerprint Defender 
 • Lifeel – scan and test 
 • Launcher iOS 15
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top