షాకింగ్‌ న్యూస్‌..భారీగా పెరిగిన బంగారం ధరలు..వెండి వెయ్యికి పైగా..!

Gold Silver Prices on April 19: Gold and Silver Shine - Sakshi

అంతర్జాతీయ పరిణామాలతో బంగారం, సిల్వర్‌ ధరలు సోమవారం రోజున భారీగా పెరిగాయి. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్యవిధానాలను కఠినతరం చేసే అవకాశాలు, రష్యా-ఉక్రెయిన్‌ వార్‌, ప్రపంచ ద్రవ్యోల్భణ ప్రభావంతో గోల్డ్‌, సిల్వర్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక సిల్వర్‌ ఒకరోజులోనే రూ. 1000కిపైగా పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్‌)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ .53, 148 వద్ద ట్రేడవుతోంది. ఇక  సీల్వర్ ఫ్యూచర్స్ ధర ఎమ్‌సీఎక్స్‌లో రూ.69, 976వద్ద ఉంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి.

ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం..  హైదరాబాద్‌లో సోమవారం 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.320కి పైగా పెరిగి రూ. 54,380కి చేరుకుంది. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి,  రూ.49,850కి పెరిగింది. సిల్వర్‌ ధరలు సోమవారం ఏకంగా రూ. 1000పైగా పెరిగి కిలో సిల్వర్‌ ధర రూ. 75,200కు చేరుకుంది. మంగళవారం సిల్వర్‌ ధరలు కాస్త తగ్గాయి. కేజీ సిల్వర్‌ ధర రూ. 300 తగ్గి రూ. 74,900 వద్ద ఉంది.   

చదవండి: ఆరు వారాల్లో అతిపెద్ద నష్టం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top