Gold rate 3 April 2023: తగ్గిన పసిడి ధర,గుడ్‌ న్యూసేనా?

Gold rate 3 April 2023 Good news fall in price check price - Sakshi

సాక్షి,ముంబై: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సోమవారం బంగారం ధరలుభారీగా తగ్గాయి. రూ. 500కుపైగా క్షీణించి  10 గ్రాములకు రూ. 59,251స్థాయికి  చేరింది.   శుక్రవారం 10 గ్రాములు రూ. 59,751గా ఉంది.  వెండి ధర కూడా  కిలోకి రూ.409 తగ్గి రూ.71,173కి పడిపోయింది. 

(ఇదీ చదవండి: NMACC పార్టీలో టిష్యూ పేపర్‌ బదులుగా, రూ.500  నోటా? నిజమా?)

హైదరాబాద్‌మార్కెట్‌లో రూ. 300 క్షీణించి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.59670,  22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.54700 వద్ద కొనసాగుతోంది.  కిలో వెండి కూడా 500  తగ్గి 74000గా  ఉంది. (NMACC: డాన్స్‌తో ఇరగదీసిన షారూక్, గౌరీ, ఇక ప్రియాంక చోప్రా డాన్స్‌కైతే)

ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం (ఏప్రిల్ 3, 2023) పది గ్రాములకు రూ. 59251 వద్ద ట్రేడవుతోంది. అలాగే శుక్రవారం రూ.1582 పెరిగిన  కిలో వెండి ధర  రూ.71173 వద్ద ట్రేడవుతోంది. (మెక్ డోనాల్డ్స్ అన్ని ఆఫీసులు మూత, ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం!)

అటు మల్టీ  కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)‌లో కూడా బంగారం వెండి ధరలు బలహీనంగా  ఉన్నాయి. ఏప్రిల్ 2023 ఫ్యూచర్స్  రూ. 342.00 పతనంతో రూ. 59,060.00 వద్ద, మే 5, 2023న వెండి ఫ్యూచర్స్ ట్రేడింగ్ రూ. 604.00 పతనంతో రూ.71,614.00 స్థాయికి  చేరింది.  అంతర్జాతీయ మార్కెట్‌లో  ఔన్స్ బంగారం 4.33 డాలర్ల లాభంతో 1,953.72 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్స్‌కు 0.21 డాలర్లు తగ్గి 23.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top