
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) లాంచ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో పలువురు రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు, సినీరంగ సెలబ్రిటీలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. బాలీవుడ్ ఖాన్ త్రయంతోపాటు, దీపికా, రణవీర్, కరీనా కపూర్-సైఫ్ అలీ ఖాన్ ,ఫ్యాషన్‌స్టార్ సోనమ్ కపూర్, వరుణ్‌ధావన్, రణ్‌వీర్ సింగ్, సీనియర్ నటులు రేఖ , వహీద తదితర స్టార్‌డస్ట్ అంతా గ్లామరస్‌గా కనిపించారు.
ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌తో కలిసి డ్యాన్స్ ఇరగ దీశారు. షారుఖ్ ఖాన్ హిట్ ట్రాక్ ఝూమ్ జో పఠాన్‌కి స్టెప్పులేశారు. ఇండో కెనడియన్ సింగర్ అమృత్ పాల్ సింగ్ ధిల్లాన్ (ఏపీ సింగ్) పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. గౌరీ బెస్ట్ ఫఫ్రెండ్ మహీప్ కపూర్, పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌ని కూడా ఈ వీడియోలో చూడొచ్చు.
అంతముందు వరుణ్ ధావన్, సూపర్ మోడల్ జిగి హడిద్ స్టేజ్‌పై సందడి చేశారు. మరోవైపు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా స్టేజ్‌పై షారూఖ్ ఖాన్‌ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉత్సాహం నెలకొంది. తనతోపాటు స్టెప్ప్‌లేయాల్సిందిగా వరుణ్‌ధావన్, రణ్‌వీర్ సింగ్‌ను కోరడంతో మరింత జోష్ నెలకొంది
మరోవైపు బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ ప్రియాంక చోప్రా, హీరో రణవీర్ సింగ్‌తో కలిసి డ్యాన్స్ చేసింది.దీనికి షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఎంజాయ్ చేయడం విశేషంగా నిలిచింది.
GAURI KHAN ??? DANCING AND VIBING TO PRIYANKA’S PERFORMANCE??? NOW THIS IS MY MULTIVERSE OF MADNESS 😭😭😭😭
— k. (@karishmaokay) April 2, 2023
*screamingggg*#PriyankaChopra pic.twitter.com/0y3Ku7Vvt9