McDonald's Temporarily Shuts US Offices, Prepares Layoff Notices - Sakshi
Sakshi News home page

మెక్ డోనాల్డ్స్ అన్ని ఆఫీసులు మూత, ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం! 

Apr 3 2023 2:26 PM | Updated on Apr 3 2023 2:58 PM

McDonald Temporarily Shuts US Offices Prepares Layoff Notices Report - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్ చైన్‌లలో ఒకటైన మెక్‌డొనాల్డ్స్ సంచలననిర్ణయం తీసుకుంది. అమెరికా లోని అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. ఈ మేరకు ఉద్యోగాలపై వేటు వేయనుంది. తాజాగా మరో రౌండ్ తొలగింపులకి సిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సోమవారం నివేదించింది. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారనే దానిపై స్పష్టత లేదు. 

సోమవారం నుండి బుధవారం వరకు ఇంటి నుండి పని చేయడం ప్రారంభించాలని కంపెనీ గత వారమే మెక్ డోనాల్డ్స్ అమెరికా ఉద్యోగులకు మెయిల్ పంపింది. ఈ వారంలో షెడ్యూల్  అయిన  అన్ని వ్యక్తిగత సమావేశాలను రద్దు చేయాలని కూడా కంపెనీ ఉద్యోగులను కోరినట్టు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 5, బుధవారం  దీనిపై అధికారిక  ప్రకటన వెలువడే అవకాశం  ఉందని అంచనా. త్వరలోనే  ఉద్యోగులను తీసివేయనున్నట్టు కూడా మెక్ డోనాల్డ్స్ ప్రకటించనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.

కాగా ప్రపంచ ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్బణ ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో  గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్‌తో సహా అనేక టెక్ దిగ్గజాలు  భారీగా ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement