Gold Price: బంగారం కొనేవారికి భారీ షాక్.. భగ్గుమన్న ధరలు..!

Gold Prices Surge To Highest in a Year, Jump RS 1400 Per 10 Gram on FEB 24 - Sakshi

Gold Prices Surge To Highest in a Year: మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. నేడు బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా దాడికి దిగడంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 2022లో గరిష్ట స్థాయికి పెరిగింది. ఎంసీఎక్స్'లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర ఈ రోజు ₹1,400కు పైగా పెరగడంతో ₹51,750 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర  1950 డాలర్లకు చేరుకుంది. సుమారు 13 నెలలో ఇదే గరిష్టం. ఔన్స్ (28.3495 గ్రాములు) బంగారం ధర త్వరలో $1950-$2000 వరకు వెళ్ళవచ్చని మార్కెట్ నిపుణులు తెలిపారు.

బులియన్ జేవెల్లర్స్ ప్రకారం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్‌ గోల్డ్‌ 999) బంగారం ధర సుమారు రూ.1300కి పైగా పెరిగి రూ.51,419కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.45,870 నుంచి రూ.47,100కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46000 నుంచి రూ.46,850కు పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.850 పెరిగింది అన్నమాట. ఇక బిస్కెట్‌ గోల్డ్‌ బంగారం ధర రూ.930 పెరిగి రూ.51,110కి చేరుకుంది.
 

ఇక పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.2300కి పైగా పెరిగి రూ.66,501కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. 

(చదవండి: మ‌రో ప్ర‌మాదం అంచున ఉక్రెయిన్‌, ఇది ర‌ష్యా ప‌నేనా?!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top