పండగ డిమాండ్ : ఎగిసిన పసిడి

ముంబై : ధన్‌తేరస్, దివాళి వేడుకల నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరగడంతో గురువారం దేశీ మార్కెట్‌లో బంగారం ధరలు భారమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పెరగడంతో ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 466 రూపాయలు పెరిగి 50,635 రూపాయలకు ఎగిసింది. ఇక కిలో వెండి 259 రూపాయలు భారమై 62,800 రూపాయలు పలికింది.
ఇక కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్‌పై సానుకూల ప్రకటనలతో ఇటీవల పసిడి ధరలు దిగిరావడం ధన్‌తేరస్, దివాళీ సీజన్‌లో ఆభరణల కొనుగోళ్లు ఊపందుకోవచ్చని బులియన్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ కేసులు ప్రబలడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలపై న్యాయపరమైన వివాదాలు, అనిశ్చితి వాతావరణంతో మరికొద్ది రోజులు బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పసిడి ధరలు తగ్గుముఖం పట్టిన సందర్భాల్లో కొనుగోళ్లకు దిగాలని సూచిస్తున్నారు. చదవండి : కరోనా సెగ : పసిడి డిమాండ్ ఢమాల్!
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి