అందుకే.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు! | Gold Prices Reverse Decline and Rise Sharply Amid US–Iran Ceasefire Talks And Global Economic Uncertainty | Sakshi
Sakshi News home page

అందుకే.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!

May 29 2026 5:37 PM | Updated on May 29 2026 7:30 PM

Gold Prices Climb Amid US Iran Truce Expectations

బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. ఈ రోజు (మే 29) గోల్డ్ రేటు ఒక్కసారిగా పెరిగింది. ఉన్నట్టుండి పసిడి ధరలు పెరగడానికి కారణాలు ఏమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలు. ద్రవ్యోల్బణం, అమెరికా వడ్డీ రేట్ల పెంపుపై కొనసాగుతున్న ఆందోళనలు కూడా పసిడి ధరలపై ప్రభావం చూపించిందని న్యూస్ ఏజెడ్ తన నివేదికలో వెల్లడించింది.

మార్కెట్ వివరాల ప్రకారం.. స్పాట్ గోల్డ్ ధర 0.3 శాతం పెరిగి ఔన్స్‌కు సుమారు 4,505.57 డాలర్లకు చేరింది. అదే సమయంలో అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా పెరిగి 4,535.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

గోల్డ్‌సిల్వర్ సెంట్రల్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ లాన్ ప్రకారం.. కాల్పుల విరమణ ప్రకటన రాకముందు ధరలు ఇంకా పడిపోతాయని భావించారు. కానీ అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందాలకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో రలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి చాలా అస్థిరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధి ద్వారా షిప్పింగ్‌పై ఉన్న ఆంక్షలను సడలించే అవకాశం ఉంది. ఇది ప్రపంచ చమురు మరియు వాణిజ్య రవాణాపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే.. ఈ ఒప్పందం ఇంకా పూర్తిగా ఫైనల్ కాలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం ఇంకా రావాల్సి ఉంది. అదే.. సమయంలో ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా ఈ ఒప్పందం పూర్తిగా ఖరారు కాలేదని తెలిపింది.

ఇదీ చదవండి: ఢిల్లీ ఘటన: అందుకే ACలు పేలిపోతున్నాయ్!

Advertisement
 
Advertisement
Advertisement