హమ్మయ్య! దిగొస్తున్న బంగారం ధరలు..

Gold Price On 29 March 2022: Gold Price Down RS 150 in Hyderabad - Sakshi

గత కొద్ది రోజులుగా బంగారం ధరల విషయంలో ఊగిసలాట దొరణి కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నిన్న, నేడు మళ్లీ తగ్గాయి. ప్రపంచ మార్కెట్లలో ఫ్లాట్ రేట్ల నేపథ్యంలో మంగళవారం భారతదేశంలో బంగారం ధరలు అర శాతానికి పైగా పడిపోయాయి. మల్టీ కమోడిటీఎక్స్ఛేంజ్ (ఎమ్‌సీఎక్స్‌)లో గోల్డ్ ధర ఫ్యూచర్స్ ధర(0.7 శాతం) రూ.357 తగ్గి 10 గ్రాములకు రూ.51,214 వద్ద ట్రేడవుతోంది. వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.525(0.8 శాతం) తగ్గి రూ.67,580 వద్ద కొనసాగుతోంది. 

స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1,925.71 డాలర్ల వద్ద ఉంటే, అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.8 శాతం క్షీణించి 1,924.20 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఈ వారం రష్యా- ఉక్రెయిన్ మధ్య ఇస్తాంబుల్‌ వేదికగా శాంతి చర్చలు జరుగునున్న నేపథ్యంలో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కేవలం రెండు రోజుల్లో దేశంలో బంగారం ధర సుమారు రూ.600 తగ్గింది. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.150కి పైగా తగ్గి ₹51,509కి చేరుకుంది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,314 నుంచి రూ.47,182కి తగ్గింది.
 

అలాగే, మన హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.47,750కి చేరుకుంది. ఇంకా, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.52,310 నుంచి రూ.52,100కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. నేడు 1 కేజీ వెండి ధర రూ.67,782 నుంచి రూ.67,344కి తగ్గింది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. 

(చదవండి: ఏప్రిల్ నెల బ్యాంకు సెలవులు జాబితా ఇదే..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top