న్యూఢిల్లీ: అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధానికి రెండు వారాల విరామంపై అంగీకారంతో ర్యాలీ చేసిన పసిడి, వెండి ఒక్క రోజు తిరగకుండానే గురువారం అమ్మకాల ఒత్తిడికి నష్టపోయాయి. కాల్పుల విరమణకు విరుద్ధంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిందంటూ, ఒప్పందం నుంచి తప్పుకుంటామని ఇరాన్ చేసిన హెచ్చరికలు, హర్మూజ్‌ను మూసేసిందన్న వార్తలతో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.
ఈ ప్రభావంతో ఢిల్లీ మార్కెట్లో వెండి కిలోకి ఏకంగా రూ.7,800 నష్టపోయి రూ.2.43 లక్షలకు దిగొచి్చంది. అటు బంగారం 10 గ్రాములకు రూ.1,500 తగ్గి రూ.1,54,900 స్థాయికి పరిమితమైంది. ‘పశి్చమాసియాలో కాల్పుల విరమణపై ఏర్పడ్డ సందేహాలతో బంగారం, వెండి ముందటి రోజు లాభపడిన స్థాయిలో నష్టపోయాయి. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై అనిశి్చతులు నెలకొనడం, ట్యాంకర్లు నిలిచిపోయాయన్న సమాచారం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపించింది.
దీంతో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనలు తిరిగి నెలకొన్నాయి’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 12 డాలర్లు పెరిగి 4,789 డాలర్ల వద్ద ఉంటే, వెండి 0.74 డాలర్ల నష్టంతో 74.83 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.


